ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రి
Actor ProfileActor

ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రి
Samayam Telugu23 Jul 2026
ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రి

మన ఇంటికి నిజంగానే శాపం తగిలిందేమో అన్నయ్య అని పెద్దితో కేశవ అంటాడు. మునీశ్వరులు ఇచ్చేది శాపం అవుతుంది.. ఇలా నోటికి ఎంతొస్తే అంత వాగే వాళ్లు ఇచ్చేది శాపం కాదు.. మన నాన్న ఓ నింద మోస్తూనే ఉన్నాడు.. ఇప్పుడు చక్రి తన తలరాతను తానే రాసుకున్నాడు.. నిజాయితీగానే ప్రేమించాడు.. కానీ ఆ ప్రేమను సరిగ్గా వ్యక్త పర్చలేదు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుని జీవితానికి సరిపడా బాధను నేను మోస్తున్నాను.. నాలా మీరు ఎవ్వరూ కాకూడదు.. ప్రేమిస్తే మన ప్రేమను అర్థమయ్యేలా చెప్పాలి.. చర్యలతో చెప్పాలి అని పెద్ది అంటాడు. ఇక శైలుకి తన ప్రేమను చెప్పాలని రాత్రి పూటే బయల్దేరుతాడు కేశవ. ఈ ముంగీస గాడేంటి ఇంకా రావడం లేదు అని ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంటుంది శైలు. ఈ చోటు గాడు చెప్తే ఫీలై ఉంటాడు.. కానీ ఇంకా రావడం లేదేంటి అని శైలు అనుకుంటుంది. ఈ బుస్సు ఉండే పుట్ట ఎక్కడుంది.. ఒక్కసారి బుస్సు కొట్టవే బుస్సు.. ఎక్కడున్నావో అర్థం కావడం లేదు అని కేశవ అనుకుంటాడు. దీంతో కేశవని చూసి శైలు తెగ సంబరపడుతుంది.నీతో మాట్లాడేందుకు వచ్చా.. ఇంటి ముందున్న చెత్తంతా ఊడ్చేసి బయట పారబోసేందుకు వచ్చినట్టుగా వస్తుంది శైలు. తన బైక్ ఏదో రిపేర్ అయినట్టుగా రిపేర్ చేస్తూ నటిస్తుంటాడు కేశవ. చెత్త తీసుకుపోయేందుకు వచ్చావా? అని కేశవకు శైలు కౌంటర్ వేస్తాడు. నీ ఇంటికి ఏ మాత్రం రాలేదు లే.. అని అంటాడు. నీతో మాట్లాడేందుకు వచ్చా.. ఒకటి అడుగుతా నిజం చెప్పు.. చోటు ఏదో చెప్పాడు.. నీ ఇంట్లో ఏదో అవుతుందట.. అని కేశవ అంటాడు. వంట అవుతుందట.. అని శైలు కౌంటర్ వేస్తుంది. పెళ్లి చూపులు అయ్యాయ్ అంట.. అని కేశవ అంటాడు. అవును అని శైలు అంటుంది.నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పరా అయితే నీకేంట్రా అని