నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష
Actor ProfileActor

నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources2
నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష
Zee Telugu5 Jul 2026
నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

Nara Rohith: టాలీవుడ్ నటుడు నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ శుభవార్తతో నారా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుండగా, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ శుభవార్తతో నారా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. గతేడాది అక్టోబర్ 30న వివాహ బంధంతో ఒక్కటైన నారా రోహిత్, శిరీషలు కొద్ది నెలల్లోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కావడంతో వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావడంతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా రోహిత్, శిరీషల ప్రేమకథ కూడా ఆసక్తికరంగానే సాగింది. వీరిద్దరూ కలిసి నటించిన 'ప్రతినిధి 2' సినిమా సమయంలో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అనంతరం పెద్దల అంగీకారంతో 2024 అక్టోబర్ 13న నిశ్చితార్థం చేసుకుని, అదే నెల 30న హైదరాబాద్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, నారా రోహిత్ టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకునే నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా కంటెంట్ ప్రధానమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. ఇటీవల విడుదలైన 'సుందరకాండ' చిత్రంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో తండ్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన నారా రోహిత్, మరోవైపు సినీ కెరీర్‌లో కూడా బిజీగా

నారా లోకేష్ తో పోలిక... నేషనల్ మీడియా డిబేట్ లో రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్
Samayam Telugu5 Jul 2026
నారా లోకేష్ తో పోలిక... నేషనల్ మీడియా డిబేట్ లో రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఇమేజ్‌ని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. చరణ్ కెరీర్‌లోనే

నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష
Samayam Telugu4 Jul 2026
నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

టాలీవుడ్ ప్రముఖ నటుడు నారా రోహిత్ కుటుంబంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శిరీష ఒక మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఈ దంపతుల జీవితంలోకి సరికొత్త అతిథి అడుగుపెట్టడంతో నారా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంతోషకరమైన వార్త బయటకు రావడంతో అటు నందమూరి, ఇటు నారా అభిమానులు నెట్టింట పండగ చేసుకుంటున్నారు. నారా రోహిత్, శిరీషల వివాహం గతేడాది అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 'ప్రతినిధి 2' చిత్రంలో వీరిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన తరుణంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో అక్టోబర్ 13, 2024న నిశ్చితార్థం చేసుకోగా, ఏడాది తర్వాత ఘనంగా పెళ్లి పీటలెక్కారు. వీరి వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పెద్దలుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లయిన కొద్ది నెలలకే తమ వైవాహిక బంధానికి గుర్తుగా వారసుడు జన్మించడంతో నారా రోహిత్ ఇంట ఆనంద క్షణాలు వ్యక్తమవుతున్నాయి.* విజయ్ బర్త్‌డేకు త్రిష నో పోస్ట్.. లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా? టాలీవుడ్‌లో మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకునే నటుడిగా నారా రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ హంగులకు పోకుండా కంటెంట్ ప్రధానమైన సినిమాలను ఎంచుకుంటూ ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన, నటుడిగా మరోసారి మంచి ప్రశంసలు అందుకున్నారు. పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం