టాలీవుడ్ ప్రముఖ నటుడు నారా రోహిత్ కుటుంబంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
శిరీష ఒక మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఈ దంపతుల జీవితంలోకి సరికొత్త అతిథి అడుగుపెట్టడంతో నారా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంతోషకరమైన వార్త బయటకు రావడంతో అటు నందమూరి, ఇటు నారా అభిమానులు నెట్టింట పండగ చేసుకుంటున్నారు. నారా రోహిత్, శిరీషల వివాహం గతేడాది అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 'ప్రతినిధి 2' చిత్రంలో వీరిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన తరుణంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో అక్టోబర్ 13, 2024న నిశ్చితార్థం చేసుకోగా, ఏడాది తర్వాత ఘనంగా పెళ్లి పీటలెక్కారు. వీరి వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పెద్దలుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లయిన కొద్ది నెలలకే తమ వైవాహిక బంధానికి గుర్తుగా వారసుడు జన్మించడంతో నారా రోహిత్ ఇంట ఆనంద క్షణాలు వ్యక్తమవుతున్నాయి.* విజయ్ బర్త్‌డేకు త్రిష నో పోస్ట్.. లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా? టాలీవుడ్లో మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకునే నటుడిగా నారా రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ హంగులకు పోకుండా కంటెంట్ ప్రధానమైన సినిమాలను ఎంచుకుంటూ ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన, నటుడిగా మరోసారి మంచి ప్రశంసలు అందుకున్నారు. పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం నారా రోహిత్ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో పాటు సోలో హీరోగా మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా ఆయన నటిస్తున్నారు. ఇలా ఒకవైపు తండ్రిగా సరికొత్త బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు వరుస సినిమాలతో నారా రోహిత్ డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు.