
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సడన్‌గా కాంగ్రెస్ పార్టీ సర్వే ఎందుకు చేసింది?, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పక్కన


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సడన్‌గా కాంగ్రెస్ పార్టీ సర్వే ఎందుకు చేసింది?, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పక్కన

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. నిర్మల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ దేవి (Basara Gnana Saraswati Temple Theft) ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. నిన్న (సోమవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు, హుండీని కూడా ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈరోజు (మంగళవారం) ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం, నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ఆలయ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి అలంకరణలో ఉన్న వెండి కిరీటం మాయం కావడంతో పాటు, భక్తులు సమర్పించిన కానుకల హుండీ కూడా కనిపించకుండా పోయింది. ఈ హుండీలోని నగదును కాజేసిన తర్వాత వ్యాసగుడి సమీపంలో పడేసి పరారయ్యారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన అర్చకులు వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయ వెనుక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారనే కోణంలో విజువల్స్ ద్వారా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బాసర ఆలయంలో ఈ స్థాయి చోరీ జరగడంపై భక్తులు