
ఇండియాలో డిజిటల్ లైఫ్‌స్టైల్ చాలా వేగంగా మారిపోతోంది. మెట్రోలో వెబ్ సిరీస్‌లు చూడటం, వర్చువల్ మీటింగ్స్, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం.. ఇలా ప్రతిదానికీ మ్యూజిక్, ఆడియో అనేవి మన లైఫ్‌లో భాగమైపోయాయి. యూజర్లు ఇప్పుడు అన్ని అవసరాలను తీర్చే ఒకే ఒక పవర్‌ఫుల్ ఆడియో డివైజ్ కోసం చూస్తున్నారు. అయితే, ₹5,000 లోపల ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఇయర్‌బడ్స్ దొరకడం ఇప్పటివరకు ఒక ఛాలెంజ్‌గా ఉండేది. కానీ, ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఓప్పో సరికొత్త ప్రొడక్ట్‌తో మన ముందుకు వచ్చేసింది. డైలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో బెస్ట్ కంపానియన్‌గా ఉండేలా ఒప్పో తన లేటెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఒప్పో ఎన్‌కో ఎయిర్5 ప్రో ని మార్కెట్లోకి తెచ్చింది. ఇమర్సివ్ ఆడియో, అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, స్మార్ట్ ఫీచర్లను చాలా తక్కువ ధరలోనే అందిస్తోంది. భారతదేశంలో ₹4,999 ధరతో లాంచ్ అయిన ఈ ఒప్పో ఎన్‌కో ఎయిర్5 ప్రో, ప్రస్తుతం లభిస్తున్న బెస్ట్ ఆల్-రౌండర్ TWS ఇయర్‌బడ్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్, ఆడియో క్వాలిటీ, క్లియర్ కాల్స్, బ్యాటరీ లైఫ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇది బెస్ట్ అనిపిస్తోంది. మెట్రో ప్రయాణాలు, ఓటీటీ సిరీస్‌లు, ఆఫీస్ మీటింగ్స్ లేదా బీజీఎంఐ లాంటి కాంపిటేటివ్ గేమ్స్.. ఇలా ఏ అవసరానికైనా ఈ ఇయర్‌బడ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. ఇయర్‌బడ్స్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ చూసే మెయిన్ ఫీచర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఒప్పో ఎన్‌కో ఎయిర్5 ప్రో కేవలం డిస్ట్రాక్షన్స్‌ని దూరం చేయడమే కాదు, మీకు నచ్చిన మ్యూజిక్ ప్రపంచంలో మిమ్మల్ని ముంచేస్తుంది. ఇది 5000Hz అల్ట్రా-వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో ఏకంగా 55dB ANCని అందిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో, అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇయర్‌బడ్స్‌లో కూడా ఇలాంటి స్పెసిఫికేషన్ చూడటం చాలా అరుదు. చాలా ఇయర్‌బడ్స్ చుట్టుపక్కల ఉండే హెవీ సౌండ్స్‌ని మాత్రమే ఆపగలవు, కానీ ఈ ఒప్పో