
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్ 22) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు ఇతరులకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వర్చువల్ (ఆన్‌లైన్) హాజరుకు కోర్టు నిరాకరించడంతో ఆయన నేరుగా వస్తారా, లేక క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కేసు నేపథ్యం ఇదే! డిసెంబర్ 4, 2024న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఒకేసారి పోటెత్తడంతో అక్కడ తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో రేవతి (39) అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తగిన భద్రతా అనుమతులు తీసుకోకపోవడం, పోలీసుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, మేనేజర్‌లను A1 నుంచి A10 నిందితులుగా పేర్కొనగా