తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం.. శ్రీవారి భక్తుల కోసం రూ.27.5 కోట్లతో ఊహించని గిఫ్ట్
Actor ProfilePolitician

తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం.. శ్రీవారి భక్తుల కోసం రూ.27.5 కోట్లతో ఊహించని గిఫ్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం.. శ్రీవారి భక్తుల కోసం రూ.27.5 కోట్లతో ఊహించని గిఫ్ట్
Zee Telugu6 Aug 2026
తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం.. శ్రీవారి భక్తుల కోసం రూ.27.5 కోట్లతో ఊహించని గిఫ్ట్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Anant Ambani Tirumala Donation: తిరుమల కోసం రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రకటించిన అనంత్‌ అంబానీ.. ఈ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన 50 మంది డ్రైవర్ల వేతనాలను రిలయన్స్ సంస్థే భరిస్తుందని, వీటి కోసం ప్రత్యేక ఇ-ఛార్జింగ్ స్టేషన్లను కూడా తిరుమలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అంబానీ వారసుడు అద్భుతమైన కానుకను ప్రకటించారు. అనంత అంబానీ నేడు సుప్రభాత సేవలో పాల్గొని, భక్తుల రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తుల రవాణా కోసం ఈ అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ బస్సులు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. ఈ భారీ విరాళం వల్ల తిరుమలలో కాలుష్యం తగ్గుతుంది. భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుతాయి. బస్సులతో పాటు డ్రైవర్ల జీతాలను కూడా రిలయన్స్ భరించడం వల్ల టీటీడీపై భారం తగ్గుతుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు, ఆదివారం సిఫార్సు లేఖలను కూడా స్వీకరించడం లేదు. ఆన్‌లైన్ ఏ-రోజుకారోజే బుకింగ్ ద్వారా వచ్చిన