
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ గురించి తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రజ్యోతి, జూన్ 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ గురించి తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ కోసం చేతితో రాసిన చీటీలను ఆయన మాత్రమే ఉపయోగించే ప్రైవేట్ ప్రదేశాలలో నటాలీ హార్ప్ వదిలివెళ్లేవారని సదరు పుస్తకంలో రాసుకొచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ప్రముఖ జర్నలిస్టులు మ్యాగీ హేబర్‌మన్, జోనాథన్ స్వాన్ రాసిన కొత్త పుస్తకం 'Regime Change: Inside the Imperial Presidency of Donald Trump'లో ఈ విషయాలను వెల్లడించారు. వ్యక్తిగత ప్రదేశాలలో చీటీలు: నటాలీ హార్ప్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తనకున్న అమితమైన భక్తిని, నమ్మకాన్ని చాటుకుంటూ ఆయన ఉపయోగించే ప్రైవేట్ లేదా వ్యక్తిగత ప్రదేశాలలో (Personal Spaces) చేతితో రాసిన కొన్ని లేఖలను/చీటీలను వదిలివెళ్లేవారని రచయితలు సదరు పుస్తకంలో పేర్కొన్నారు. ఆమె ఉంచిన ఒక నోట్‌లో 'నాకు మీరే సర్వస్వం' అని రాసి ఉందని, మరో లేఖలో ట్రంప్‌ను తన 'రక్షకుడు'గా అభివర్ణించారని పుస్తకంలో రాశారు. వైట్ హౌస్ స్పందన: అయితే, ఈ రాతలపై ట్రంప్ అంతర్గత బృందం, వైట్ హౌస్ ప్రతినిధులు స్పందిస్తూ, నటాలీ హార్ప్ వైట్ హౌస్‌లో అత్యంత కష్టపడి పనిచేసే నమ్మకమైన అధికారి అని, ఆమెపై వస్తున్న వార్తలు కేవలం 'ఫేక్ న్యూస్ మీడియా' సృష్టిస్తున్న ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు. ఈ ఆరోపణలను వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ తీవ్రంగా తోసిపుచ్చారు. అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ తరహాలో సోషల్ మీడియాను విజయవంతంగా ఉపయోగించుకున్న అధ్యక్షుడు మరొకరు లేరని, ట్రంప్ సాంప్రదాయ వార్తా సంస్థలపై ఆధారపడకుండా, నేరుగా ప్రజలతో మాట్లాడటానికే ట్రూత్ సోషల్ ను ఉపయోగిస్తారని దేశాయ్ పేర్కొన్నారు. 'ఫేక్ న్యూస్ మీడియా తమను పక్కన పెట్టడాన్ని తట్టుకోలేకపోతోంది