జనాభా గణన.. అప్పట్లో రంగు రంగుల కాగితాలతో హైదరాబాద్ జనాభాను ఎలా లెక్కించారో తెలుసా
Actor ProfileCelebrity

జనాభా గణన.. అప్పట్లో రంగు రంగుల కాగితాలతో హైదరాబాద్ జనాభాను ఎలా లెక్కించారో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జనాభా గణన.. అప్పట్లో రంగు రంగుల కాగితాలతో హైదరాబాద్ జనాభాను ఎలా లెక్కించారో తెలుసా
Samayam Telugu19 Jun 2026
జనాభా గణన.. అప్పట్లో రంగు రంగుల కాగితాలతో హైదరాబాద్ జనాభాను ఎలా లెక్కించారో తెలుసా

Hyderabad 1901 Census History : ఆధునిక సాంకేతికత, కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు అందుబాటులోకి రాకముందు.. అదీ నూట ఇరవై ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం క్రితమే హైదరాబాద్‌ సంస్థానంలో అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన పద్ధతిలో జనాభా గణన జరిగిందన్న విషయం మీకు తెలుసా? 1901లో నిజాం పరిపాలన సాగుతున్న కాలంలో.. అప్పటి జనాభా లెక్కల అధికారులు కేవలం రంగు రంగుల కాగితపు స్లిప్పులు, ప్రత్యేక శారీరక, సామాజిక గుర్తులను ఉపయోగించి సమగ్ర జనాభాను లెక్కించారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో జరిగిన రెండో జనాభా గణనలో ప్రవేశపెట్టిన ఈ వినూత్న పద్ధతికి సంబంధించిన పలు ఆసక్తికరమైన చారిత్రాత్మక విశేషాలు ఆర్కైవ్స్ రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం. టాలీ మార్కులకు స్వస్తి.. జర్మనీ టెక్నాలజీకి జై!నిజాం రాజ్యంలో.. ముఖ్యంగా 1891 సమయంలో మొదటిసారి జనాభా గణన నిర్వహించినప్పుడు.. వ్యక్తుల వివరాలను నమోదు చేయడానికి కాగితాలను వాడేవారు. ముఖ్యంగా ఇందుకోసం ఆ కాగితాలపై గీతలు గీయడం అనే సాంప్రదాయ పద్ధతిని వాడేవారు. అయితే ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, శ్రమతో కూడుకున్నదిగా, తప్పులు దొర్లడానికి ఆస్కారం ఉన్నదిగా ఉండేది. దీంతో నాటి ప్రముఖ గణాంక నిపుణులు ఈ పాత పద్ధతిని నమ్మదగనిదిగా పెదవి విరిచారు. దీనిని అధిగమించడానికి హైదరాబాద్ సెన్సస్ ఆపరేషన్స్ అధిపతిగా ఉన్న 'మీర్జా మెహదీ ఖాన్' సరికొత్త ఆలోచన చేశారు. 1871లో జర్మనీలోని 'బవేరియన్ జనాభా గణన'లో విజయవంతంగా ఉపయోగించిన కాగితపు స్లిప్పుల విధానాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఆ విదేశీ పద్ధతిని భారతదేశ పరిస్థితులకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చి.. మరింత సులభతరంగా మార్పులు చేసి 1901 జనాభా లెక్కింపులో ప్రవేశ పెట్టారు.మతం, లింగం, వైవాహిక స్థితి ఆధారంగా రంగుల స్లిప్పులు..!ఈ సరికొత్త విధానంలో భాగంగా గణన అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి నివాసితుల మతం ఆధారంగా వేర్వేరు రంగుల కాగితపు స్లిప్పులను పంపిణీ