జులై మూడో వారంలో తల్లికి వందనం
Actor ProfilePolitician

జులై మూడో వారంలో తల్లికి వందనం

Total News3
Movie Updates0
Sources3
జులై మూడో వారంలో తల్లికి వందనం
Andhra Jyothy16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అమరావతి, జూన్ 16: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. మంగళవారం అమరావతిలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై వారితో ప్రధానంగా చర్చించారు. విద్యార్థుల తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని .. జులై మూడో వారంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్‌కు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జులై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహించాలని ఈ సమీక్ష సమావేశంలో మంత్రి లోకేశ్ నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్ష(సెట్)ల నిర్వహణ సకాలంలో నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. త్వరిత గతిన నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు. బీజేపీ తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్ ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం: మంత్రి తుమ్మల

జులై మూడో వారంలో తల్లికి వందనం
TeluguOne16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జులై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహణకు సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపైనా సమావేశంలో చర్చించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష రాష్ట్రంలో ఎప్ సెట్, పాలిసెట్, ఆర్ సెట్ వంటి 12రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సెట్స్, పొరుగు రాష్ట్రాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలను కూడా గమనంలోకి తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని వివిధ సెట్ ల తేదీలను ఖరారు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఉందని

జూన్ 29న షైనింగ్ స్టార్స్ అవార్డులు
Eenadu16 Jun 2026
జూన్ 29న షైనింగ్ స్టార్స్ అవార్డులు

అమరావతి: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురస్కారాలు ‘షైనింగ్‌ స్టార్స్‌’. ఈ అవార్డు కార్యక్రమాన్ని జూన్‌ 29న