
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Padmavati Ammavari Teppotsavams: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎండలు తగ్గినప్పటికీ భక్తుల రాక మాత్రం తగ్గలేదు. తిరుమలతో పాటు ఈ ప్రాంతంలో మరెన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. తిరుమల వెళ్ళిన భక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు, శ్రీకాళహస్తి ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్నందున, భక్తుల సౌకర్యార్థం ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నారు. జూన్ 25 నుంచి జూన్ 29 వరకు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు అమ్మవారిని అలంకరించిన తెప్పలపై పద్మ సరోవరం వద్ద విహరింపజేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు దివ్య దర్శనాలు అందిస్తారు. ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేయడమే కాకుండా, వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. పద్మ సరోవరం తీరాన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు సాగే ఈ తెప్పోత్సవాలను చూడటం వల్ల కష్టాలు, సంసార బంధాల నుంచి విముక్తి లభిస్తుందని, దైవానుగ్రహంతో సర్వ సుఖాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఉత్సవాలను వీక్షించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జూన్ 25న రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి తెప్పోత్సవం, మరుసటి రోజు శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం జరుగుతాయి. అనంతరం జూన్ 27 నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు పద్మ సరోవరం నీరాడ