
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Padmavati Ammavari Teppotsavams: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎండలు తగ్గినప్పటికీ భక్తుల రాక మాత్రం తగ్గలేదు. తిరుమలతో పాటు ఈ ప్రాంతంలో మరెన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. తిరుమల వెళ్ళిన భక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు, శ్రీకాళహస్తి ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్నందున, భక్తుల సౌకర్యార్థం ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నారు. జూన్ 25 నుంచి జూన్ 29 వరకు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు అమ్మవారిని అలంకరించిన తెప్పలపై పద్మ సరోవరం వద్ద విహరింపజేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు దివ్య దర్శనాలు అందిస్తారు. ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేయడమే కాకుండా, వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. పద్మ సరోవరం తీరాన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు సాగే ఈ తెప్పోత్సవాలను చూడటం వల్ల కష్టాలు, సంసార బంధాల నుంచి విముక్తి లభిస్తుందని, దైవానుగ్రహంతో సర్వ సుఖాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఉత్సవాలను వీక్షించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జూన్ 25న రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి తెప్పోత్సవం, మరుసటి రోజు శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం జరుగుతాయి. అనంతరం జూన్ 27 నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు పద్మ సరోవరం నీరాడ
మండపంలో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమాలు సాగుతాయి.
ఆర్జిత సేవలు రద్దు... తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఉత్సవాల కారణంగా ఐదు రోజుల పాటు నిర్వహించే కల్యాణోత్సవం, సేవలు, లక్ష్మీ పూజలు రద్దు చేయబడ్డాయి. ముఖ్యంగా జూన్ 26న ఈ సేవలు అందుబాటులో ఉండవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
జూన్ 25 నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు... మరోవైపు, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 25 నుంచి జూలై 3 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా కోయిల్ అళ్వార్ తిరుమంజనం, అంకురార్పణ వంటి విశేష సేవలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి 9:00 వరకు రాత్రి 7:00 నుండి 8:00 వరకు స్వామివారు దివ్య వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. జూన్ 28వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకునే జంటలు రూ.500 చెల్లించి కళ్యాణంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఉత్తరీయం, లడ్డు, అప్పం బహుమతిగా అందజేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.