చరిత్ర తిరగరాసిన... మహిళా క్యాడెట్లు
Actor ProfilePolitician

చరిత్ర తిరగరాసిన... మహిళా క్యాడెట్లు

Total News1
Movie Updates0
Sources1
చరిత్ర తిరగరాసిన... మహిళా క్యాడెట్లు
Eenadu14 Jun 2026
చరిత్ర తిరగరాసిన... మహిళా క్యాడెట్లు

భారత రక్షణ దళ చరిత్రలో మహిళా సాధికారతకు మరో అధ్యాయం తోడైంది. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎమ్‌ఏ) నుంచి తొలిసారి తొమ్మిది మంది మహిళా క్యాడెట్లు... శాశ్వత కమిషన్‌కు ఎంపికై, విధులు నిర్వర్తించబోతున్నారు. భారత రక్షణ దళ చరిత్రలో మహిళా సాధికారతకు మరో అధ్యాయం తోడైంది. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎమ్‌ఏ) నుంచి తొలిసారి తొమ్మిది మంది మహిళా క్యాడెట్లు... శాశ్వత కమిషన్‌కు ఎంపికై, విధులు నిర్వర్తించబోతున్నారు. సంబంధిత పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫీసర్లను ప్రశంసిస్తూ దీన్నో చారిత్రక మలుపుగా అభివర్ణించారు. సైన్యంలో మహిళలు ముందునుంచీ ఉన్నారు కదా... దీనికంత ప్రత్యేకత ఏముంది అంటే? తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎమ్‌ఏ)ది. దెహ్రాదూన్‌లో ఉంది. సమర్థులైన వేలాది మంది అధికారుల్ని సైన్యానికి అందించింది. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దార్ఢ్యం, దేశభక్తి వంటి అంశాల్లో సైనిక అధికారుల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతోంది. అయితే ఇప్పటివరకు ఈ అకాడమీ నుంచి శాశ్వత కమిషన్‌ (పీసీ)కు ఒక్క అధికారిణి కూడా ఎంపిక కాలేదు. ప్రవేశ విధానాల్లో పరిమితులే ఇందుకు కారణం. 1992ల నుంచే మహిళలకు సైన్యంలో చేరే అవకాశం కల్పించినా... వాళ్ల ఎంపిక, విధులు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) వరకే ఉండేవి. నిర్దిష్ట కాలం తర్వాత మహిళల శక్తి సామర్థ్యాలు, పాల్గొన్న మిషన్లు, అందించిన సేవల ఆధారంగా శాశ్వత కమిషన్‌లోకి తీసుకునేవాళ్లు. కానీ ఈ ఎంపిక అనుకున్నంత సులువుగా జరిగేది కాదు. 2020 వరకు ఇదే పరిస్థితి. పురుషులతో సమానంగా విధుల్లో పోరాడే ధైర్యం, తెగువ ఉన్నా... గుర్తింపు ఉండేది కాదు. ఈ వివక్షాపూరిత విధానాల్ని ప్రశ్నిస్తూ బబీతా పునియా అనే న్యాయవాది 2003లో దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిలో మహిళల్ని నిరాకరించడానికి కారణాలు, పెన్షన్‌ సదుపాయాలు, కమాండర్‌ పదవుల్లో వివక్ష వంటి అంశాల్ని ప్రశ్నిస్తూ... ఇవన్నీ రాజ్యంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విరుద్ధమని న్యాయపోరాటం ప్రారంభించారు