చమురు లేదు..బంగారం లేదు
Actor ProfileCelebrity

చమురు లేదు..బంగారం లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చమురు లేదు..బంగారం లేదు - స్విట్జర్లాండ్ విజయ రహస్యం ఇదే
Oneindia Telugu9 Jul 2026
చమురు లేదు..బంగారం లేదు - స్విట్జర్లాండ్ విజయ రహస్యం ఇదే

Switzerland:ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో స్విట్జర్లాండ్ ఒకటి. ప్రపంచంలోని ధనవంతులు తమ డబ్బును భద్రపరచేందుకు ఇష్టపడే దేశం కూడా ఇదే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్విట్జర్లాండ్‌కు చమురు నిల్వలు లేవు, బంగారం గనులు లేవు, సముద్ర తీర ప్రాంతం కూడా లేదు. సహజ వనరులు పెద్దగా లేని ఈ దేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగింది? ఇదే స్విట్జర్లాండ్ విజయగాథలోని అసలు ఆసక్తికర అంశం. ఐరోపా మధ్యలో ఉన్న స్విట్జర్లాండ్ ఎక్కువ భాగం ఆల్ప్స్ పర్వతాలతో నిండి ఉంటుంది. వ్యవసాయానికి అనుకూలమైన భూమి కూడా పరిమితంగానే ఉంది. దీంతో సంప్రదాయ వనరుల ఆధారంగా అభివృద్ధి సాధించడం కష్టమైంది. కానీ అదే పరిస్థితిని దేశ నాయకులు ఒక అవకాశంగా మలుచుకున్నారు. సహజ వనరులకంటే మానవ వనరులపై దృష్టి పెట్టారు. విద్య, నైపుణ్యాలు, పరిశ్రమలు, ఆర్థిక సేవల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముందుగా స్విట్జర్లాండ్‌ దేశం రైల్వే నిర్మాణం చేపట్టింది. అంటే ఆ రోజుల్లో తాము తయారు చేసిన ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించాలంటే రవాణా వ్యవస్థ ఉండేది కాదు. ఇందుకు రైల్వే మార్గం ఒక్కటే పరిష్కారం అని తలచిన నాటి నాయకులు... వెంటనే దీన్ని అమలు చేసే ప్రణాళికలు రూపొందించారు. స్విట్జర్లాండ్ భౌగోళికంగా చూస్తే ఎక్కువ శాతం పర్వతాలే ఉంటాయి. ఇక్కడ రైలు మార్గం నిర్మించాలంటే కత్తిమీద సాము లాంటిదే. కానీ అక్కడి వారు చూపిన చొరవతో అసాధ్యమనుకున్నది సాధ్యం చేశారు. స్విట్జర్లాండ్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం రైల్వే కనెక్టివిటీని తీసుకొచ్చారు. ఇక తమ ఉత్పత్తులు ఇతర ప్రాంతాల్లో కూడా విక్రయించి సొమ్ము చేసుకునే పరిస్థితికి వచ్చారు. స్విట్జర్లాండ్ సంపద వెనుక ప్రధాన కారణం దాని బ్యాంకింగ్ వ్యవస్థ. రాజకీయ స్థిరత్వం, కఠినమైన గోప్యతా చట్టాలు, విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు తమ సంపదను ఇక్కడి బ్యాంకుల్లో