
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Aha OTT New Programme: సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీలో సరికొత్గా టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా ఉండనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ - ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం మన సమాజం మీద చాలా ఇంపాక్ట్ ఉంది. ఫుడ్, ఫ్యాషన్, టూరిజం..ఇలా ప్రతి విషయంలో వాళ్లు చెప్పేది మనం ఫాలో అవుతున్నాము. అంత ప్రభావం వాళ్లు సొసైటీ మీద చూపిస్తున్నారు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేస్తున్న ఒక యూనిక్ షో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. ఇలాంటి కార్యక్రమం ఇప్పటిదాకా రాలేదు. ఈ కార్యక్రమం కోసం ఎంట్రీలను ఆహ్వానించాము. ఈ షో కు మంచు లక్ష్మి, వైవా హర్ష ఇద్దరు పర్పెక్ట్ హోస్టులు. వారి ద్వారా