గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది
Actor ProfilePolitician

గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది
NTV Telugu6 Jul 2026
గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది

Can Cow Urine Fight Chikungunya?: చికున్‌గున్యా పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది తీవ్రమైన జ్వరం, భరించలేని కీళ్ల నొప్పులు, వారాలు కాదు నెలల పాటు కొనసాగే శారీరక అసౌకర్యం. ప్రతి వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి దేశంలో మళ్లీ మళ్లీ ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చికున్‌గున్యాను నేరుగా అడ్డుకునే ప్రత్యేక యాంటీవైరల్ ఔషధం అందుబాటులో లేకపోవడంతో శాస్త్రవేత్తలు కొత్త మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానం, ఆధునిక బయోటెక్నాలజీ కలయికలో వెలుగులోకి వచ్చిన ఐఐటీ రూర్కీ అధ్యయనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ రూర్కీకి చెందిన బయోసైన్సెస్ అండ్ బయోఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ షైలీ తోమర్ నేతృత్వంలోని పరిశోధక బృందం చేపట్టిన అధ్యయనంలో ఆయుర్వేదంలో ప్రస్తావించే గౌ మూత్ర ఆర్క్ అంటే ఆవు మూత్ర డిస్టిలేట్‌ను పరిశీలించారు. ప్రయోగశాల పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ పదార్థం చికున్‌గున్యా వైరస్ పరిమాణాన్ని 90 శాతానికి పైగా తగ్గించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు సహజ బయోయాక్టివ్ సమ్మేళనాలతో రూపొందించిన ప్రత్యేక ఫార్ములేషన్ వైరల్ లోడ్‌ను 99.85 శాతం వరకు తగ్గించిందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ పరిశోధనలో వైరస్ నిరోధక ప్రభావానికి కారణమయ్యే పలు బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫలితాలు పీర్ రివ్యూడ్ శాస్త్రీయ జర్నల్ అయిన ACS(Agricultural Science & Technology)లో ప్రచురితమయ్యాయి. సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే పదార్థాలను ఆధునిక శాస్త్రీయ ప్రమాణాలతో విశ్లేషించవచ్చని ఈ అధ్యయనం మరోసారి చూపించింది. చికున్‌గున్యా వ్యాధి ఏడిస్ దోమల కాటుతో వ్యాపిస్తుంది. జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది కోలుకున్నప్పటికీ కొందరిలో కీళ్ల నొప్పులు చాలా కాలం కొనసాగుతాయి. ప్రస్తుతం చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడంపైనే ఆధారపడి ఉంది. అందుకే వైరస్‌ను నేరుగా ఎదుర్కోగల