
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బేబీ బంప్ తో కనిపించి అందరినీ షాకింగ్ కి గురి చేసింది. మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో చిన్న పొట్టతో కనపడటంతో.. ఆమె తల్లి కాబోతోందనే వార్త బయటకు వచ్చింది. అయితే.. సక్సెస్ లో భాగంగా కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే.. సమంతని కేక్ కట్ చేయమని చెబితే... నేను కత్తి పట్టుకోకూడదు.. అని చెప్పింది. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ మాట విని అందరూ షాక్ అయ్యారు.. కడుపుతో ఉన్నవారు కత్తి ఎందుకు పట్టుకోకూడదు...? నార్మల్ గా కడుపుతో ఉన్న మహిళలు అందరూ ఇంట్లో కత్తి పట్టుకుంటూనే ఉంటారు.. కదా, కూరగాయలు కట్ చేస్తూనే ఉంటారు కదా? మరి సమంత అలా ఎందుకు అని చెప్పింది.. దీని వెనక కారణం అనే విషయం ఇప్పుడు చూద్దాం.. మన దేశంలో గర్భిణీలకు సంబంధించిన ఎన్నో ఆచారాలు, నమ్మకాలు చాలా ఉన్నాయి. వాటిల్లో భాగంగానే కడుపుతో ఉన్నవారు కత్తి పట్టుకోకూడదు అనే నమ్మకం కూడా ఉంది. ఇప్పటికీ చాలా మంది ఇళ్లల్లో గర్భిణీ స్త్రీలను కత్తులు, కత్తెర లాంటి పదునైన వస్తువులను ముట్టుకోనివ్వరు. ఇలా చెప్పడం వెనక కారణం కూడా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు మహిళల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా అలసట, కళ్లు తిరగడం, నీరసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. అలాంటి సమయంలో.. ఇలాంటి పరిస్థితుల్లో కత్తి వంటి పదునైన వస్తువులు ఉపయోగిస్తే... ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే.. కత్తి, కత్తెర లాంటి పదునైన వస్తువులు ముట్టుకోకూడదు అని చెబుతుంటారు. అంతేకాదు.. ఒకప్పుడు వైద్య సదుపాయలు ఉండేవి కావు. ఏదైనా చిన్న గాయం అయినా.. దానికి సరైన వైద్యం చేయకపోతే.. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి..కడుపులో బిడ్డకు ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందని భయపడేవారు. అందుకే.. ముందు