కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే
Actor ProfileActor

కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే

Total News1
Movie Updates0
Sources1
కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే
Sakshi15 Jun 2026
కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే

బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్‌లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్‌ హీర్‌ కార్తిక్‌ ఆర్యన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్‌’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్‌ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్‌గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్‌ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత మురళీకాంత్‌ పేట్కర్‌ పాత్రలో కార్తిక్‌ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్‌ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ. గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్‌ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్‌ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్‌ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్‌లాస్‌ కోసమే ఆర్యన్‌ బాక్సింగ్‌ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్‌నెస్‌ శిక్షణ అందించిన త్రిదేవ్‌