క్లైమాక్స్ ట్విస్ట్ కేక
Actor ProfileActor

క్లైమాక్స్ ట్విస్ట్ కేక

Total News1
Movie Updates0
Sources1
క్లైమాక్స్ ట్విస్ట్ కేక
Telugu Times16 Jun 2026
క్లైమాక్స్ ట్విస్ట్ కేక

Rating: 2.75 ---సూర్య ప్రకాష్ జోశ్యుల కేరళలోని కుజినీలం పోలీస్ స్టేషన్‌. అక్కడ ఎప్పుడూ పెద్దగా కేసులుండవు. చిన్న చిన్న గొడవలు, గ్రామ సమస్యలు తప్ప హత్యలు, దోపిడీలు అక్కడి పోలీసులకు కొత్తే. అలాంటి ప్రశాంతమైన స్టేషన్‌కు కొత్త ఎస్సైగా అడుగుపెడతాడు విజయ్‌ (షేన్ నిగమ్) . తొలి పోస్టింగ్ కావడంతో కాస్త టెన్షన్ ఉన్నా, క్రైమ్ లేని ప్రాంతం కావడంతో కూల్ గా ఉంటాడు. కానీ ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలవదు. విజయ్ బాధ్యతలు చేపట్టిన రెండో రోజుకే ఊరి శివారులో గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువకుడి శవం బయటపడుతుంది. పోలీసులు ఆ కేసు గురించి ఆలోచిస్తుండగానే మరో షాక్ ఎదురవుతుంది. స్థానిక ఫైనాన్స్ కంపెనీలో భారీ దోపిడీ జరుగుతుంది. 120 సవర్ల బంగారం, రూ.50 లక్షల నగదు క్షణాల్లో మాయమవుతాయి. ఈ రెండు ఘటనలతో ఊరు ఉలిక్కిపడుతుండగానే డ్యామ్ సమీపంలో మరో శవం బయటపడుతుంది. ఒకప్పుడు ప్రశాంతంగా కనిపించిన గ్రామం ఇప్పుడు భయంతో వణికిపోతుంది. అసలు ఈ హత్యల వెనుక ఎవరున్నారు? దోపిడీకి, హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? లేక ఎవరైనా పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారా? అనుభవం లేకపోయినా బాధ్యత ఎక్కువగా ఫీలయ్యే విజయ్‌, తన టీమ్ తో కలిసి దర్యాప్తు మొదలుపెడతాడు. కానీ ప్రతి క్లూ అతడిని మిస్టరీ విప్పాల్సింది పోయి మరింత గందరగోళంలోకి నెడుతుంది. ఒక కేసును ఛేదించబోతే మరో ప్రశ్న ఎదురవుతుంది. సమయం గడుస్తోంది... పై అధికారుల ఒత్తిడి పెరుగుతోంది... నేరస్తుడు మాత్రం పోలీసుల కంటే ఒక్క అడుగు ముందే ఉన్నట్టుంటాడు. చివరికి విజయ్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? వరుస హత్యల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఫైనాన్స్ కంపెనీ దోపిడీకి కారణం ఎవరు? అనేదే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లోని అసలు ట్విస్ట్. ఎనాలసిస్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే జానర్‌ సినిమాలో ప్రేక్షకుడు కోరుకునేది ఒక్కటే — "తర్వాత ఏమవుతుంది?" అనేది