కేతన్ హత్య సీన్ రీక్రియేషన్
Actor ProfilePolitician

కేతన్ హత్య సీన్ రీక్రియేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేతన్ హత్య సీన్ రీక్రియేషన్
Eenadu8 Aug 2026
కేతన్ హత్య సీన్ రీక్రియేషన్

Pune fort murder| ఇంటర్నెట్‌డెస్క్‌: పుణె బిజినెస్‌మ్యాన్ కేతన్ అగర్వాల్‌ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీన్ రీక్రియేషన్ కోసం ఘటన జరిగిన లోహ్‌గఢ్‌ కోటకు నిందితురాలు సియా గోయల్‌ను పోలీసులు తీసుకెళ్లారు. కేతన్ చనిపోవడానికి ముందు (Ketan Agarwal Murder Case) ఘటనాస్థలంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ఒక డమ్మీని ఉపయోగించారు. సియాను కోటవద్దకు తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ రోజు ఉదయం ఘటనాస్థలం సీన్ రీక్రియేషన్ చేపట్టాం. నిందితురాలిని, ఒక డమ్మీ బాడీని అక్కడకు తీసుకెళ్లాం. కేతన్‌ను ఎలా తోసివేశారో చూపించాలని సియాను అడిగాం. నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లిన మార్గాన్ని ఆమె చూపించింది’’ అని పోలీసులు వెల్లడించారు. మరోవైపు సీన్ రీక్రియేషన్ కోసం చేతన్‌ను విడిగా తీసుకెళ్తామని చెప్పారు. పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ నేరాన్ని ఎలా ప్లాన్ చేశారు..? ఘటన జరగానికి ముందు, తర్వాత నిందితులు ఏం చేశారు..? వారి ఆన్‌లైన్ యాక్టివిటీ, హత్యకు గల కారణాలపై లోతుగా పరిశీలిస్తున్నారు. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే.. చేతన్‌తో కలిసి అతడి అడ్డుతొలగించుకునేందుకు ఈ నేరానికి పాల్పడినట్లు సియా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్‌ పేరును తరచూ ప్రస్తావించేదని కేతన్‌ కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బంధానికి అడ్డుగా ఉండడంతో తన కుమారుడిని హత్య చేశారని ఈ నెల 23న కేతన్‌ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా, చేతన్‌పై కేసు నమోదు చేశారు. గతంలో నిందితులిద్దరు క్రికెట్ మ్యాచ్‌కు హాజరైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సియా సోదరుడి ద్వారానే ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి