కేతన్ అగర్వాల్ హత్యకు ఆయన పెట్టుకున్న విగ్గే కారణమా?.. కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే
Actor ProfilePolitician

కేతన్ అగర్వాల్ హత్యకు ఆయన పెట్టుకున్న విగ్గే కారణమా?.. కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేతన్ అగర్వాల్ హత్యకు ఆయన పెట్టుకున్న విగ్గే కారణమా?.. కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే
Samayam Telugu31 Jul 2026
కేతన్ అగర్వాల్ హత్యకు ఆయన పెట్టుకున్న విగ్గే కారణమా?.. కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే

Lohagad Fort Murder Conspiracy : మహారాష్ట్రలోని లోహ్‌గఢ్ కోటపై జరిగిన పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ (25) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్తను ప్లాన్ ప్రకారం కొండపై నుంచి నెట్టేసి, దానిని ఒక ట్రెకింగ్ ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన వధువు సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)ల ఇప్పటికే అరెస్ట్ కాగా.. పోలీసుల విచారణలో షాకింగ్ కామెంట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కేతన్‌ను చంపడానికి కారణం.. అతడు విగ్ ధరించడమే అని, అందువల్లే అతడితో తనకు పెళ్లి ఇష్టం లేదని సియా చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ స్పందించారు. మరి ఆయన ఏమన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నిశ్చితార్థానికి ముందే ఆ విషయం తెలుసు..!మెడికల్ కారణాల వల్ల కేతన్‌కు తలపై ఒక చిన్న భాగంలో జుట్టు ఊడిపోయిందని, ఈ విషయాన్ని పెళ్లి ఖరారు కావడానికి చాలా కాలం ముందే సియా కుటుంబానికి స్పష్టంగా వివరించామని విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. సియాకు కేతన్ నచ్చకపోవడానికి ఇదే కారణం అని తాను భావించడం లేదని.. ఒకవేళ ఈ కారణంతోనే ఆమె కేతన్‌ను వద్దు అనుకుని ఉంటే నేరుగా చెప్పేసి పెళ్లి రద్దు చేసుకునే అవకాశం ఆమెకు ఉందని వివరించారు. కారణం ఏదైనప్పటికీ ఆమె తన కుమారుడి ప్రాణాలు తీయడం దారుణం అని కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ చంపేందుకు చాలానే ప్రయత్నాలు..!మొదట్లో ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా సియా నమ్మించినప్పటికీ.. కేతన్ సోదరికి కల్గిన అనుమానంతో.. ఆమె గుట్టురట్టయింది. ముఖ్యంగా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందనే ప్రశ్నలకు కూడా సియా నీళ్లు నమలడంతో.. ఆమెకు అనుమానం వచ్చి తండ్రికి చెప్పగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా రంగంలోకి దిగిన పోలీసులు.. సియా కాల్ డేటా పరిశీలించారు. అలాగే ప్రమాదం