కుటుంబం రమ్మన్నా.. జట్టు కోసం వార్ జోన్ ను వదల్లేదు
Actor ProfileActor

కుటుంబం రమ్మన్నా.. జట్టు కోసం వార్ జోన్ ను వదల్లేదు

Total News1
Movie Updates0
Sources1
కుటుంబం రమ్మన్నా.. జట్టు కోసం వార్ జోన్ ను వదల్లేదు
Eenadu14 Jun 2026
కుటుంబం రమ్మన్నా.. జట్టు కోసం వార్ జోన్ ను వదల్లేదు

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ 2026లో ఖతార్ ఒక్క పాయింట్‌తో ఖాతా తెరిచింది. ఇందులో సంచలనం ఏముంది? అంటారా.. విదేశీ గడ్డపై వరల్డ్‌ కప్‌లో ఖాతా తెరవడం ఖతార్‌కిదే మొదటిసారి. దీని వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ తన జట్టు కోసం తాపత్రయపడ్డారు. ఆయన పేరు జులెన్ లోపెటెగుయి.. ఓ వైపు బాంబుల వర్షం.. అక్కడి ప్రజలంటే ఎటూ పోలేని పరిస్థితి. ఇక విదేశీయులంతా వెంటనే ఖాళీ చేసేసి తమ స్వదేశానికి వెళ్లిపోతారు. కానీ, జులెన్‌ మాత్రం రానని తెగేసి చెప్పేశాడు. కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా కుదరదన్నాడు. ఇప్పుడు అతడు ఆ దేశ ప్రజలకు హీరోగా మారిపోయాడు. ఫిఫా ప్రపంచ కప్‌లో ఖతార్‌ తొలిసారి విదేశీ గడ్డపై పాయింట్‌ సాధించడంలో మేనేజర్‌గా అతడిదీ కీలక పాత్రే. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ను ఖతార్ 1-1తో సమం చేసుకుంది. అది 2018 ఫిఫా వరల్డ్ కప్‌నకు కొద్ది రోజుల ముందు.. స్పెయిన్ మేనేజ్‌మెంట్ జులెన్‌ను తప్పించింది. దానికి కారణం రియల్ మాడ్రిడ్‌కు అంగీకరించడమే. ఆ తర్వాత ఖతార్‌కు మేనేజర్‌గా మారాడు. గత వరల్డ్ కప్‌నకు ఖతార్‌ ఆతిథ్య దేశం. అప్పుడు నేరుగా అర్హత సాధించింది. కానీ, ఈసారి మాత్రం ప్రపంచ కప్‌లో ఆడాలంటే క్వాలిఫయర్స్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆ అడ్డంకిని దాటుకొని ఇప్పుడీ మెగా టోర్నీలో అడుగు పెట్టింది. ఇప్పుడు తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకుని అదరగొట్టింది. అమెరికా - ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ఖతార్‌లోనూ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ కప్‌ కోసం ఆ జట్టు సన్నద్ధత కూడా అనుకున్నంత సాఫీగా సాగలేదు. అర్జెంటీనా, సెర్బియాతో మ్యాచులూ రద్దయ్యాయి. మరోవైపు జులెన్ లోపెటెగుయిని స్వదేశానికి వచ్చేయమని కుటుంబ సభ్యులు అడగడం మొదలుపెట్టారు. కానీ, అతడు మాత్రం జట్టుతోపాటు ఉండేందుకే మొగ్గు చూపాడు. ఆనాటి విషయాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘అది చాలా దారుణమైన అనుభవం. అంతకుముందు ఎన్నడూ