ఒకేసారి రెండు భారీ భూకంపాలు! అంచనా వేయలేనంత ప్రాణనష్టం
Actor ProfilePolitician

ఒకేసారి రెండు భారీ భూకంపాలు! అంచనా వేయలేనంత ప్రాణనష్టం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు
Oneindia Telugu18 Jul 2026
లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు

ప్రకృతి సృష్టించిన భీభత్సానికి వెనిజులా దేశం అతలాకుతలమైంది. బ్యాక్-టు-బ్యాక్ సంభవించిన భయంకరమైన భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా వందలాది భవనాలు కుప్పకూలడంతో.. ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని (State

ఒకేసారి రెండు భారీ భూకంపాలు! అంచనా వేయలేనంత ప్రాణనష్టం
Oneindia Telugu17 Jul 2026
ఒకేసారి రెండు భారీ భూకంపాలు! అంచనా వేయలేనంత ప్రాణనష్టం

ప్రకృతి ప్రకోపానికి వెనిజులా దేశం ఒక్కసారిగా గుండె జారిపోయేలా వణికిపోయింది. కరీబియన్ తీర ప్రాంతంలో బుధవారం సాయంత్రం కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే బ్యాక్-టు-బ్యాక్ రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి తీవ్ర కలకలం రేపాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూమి కంపించగా, ఆ తూఫాను వేగాన్ని మరువక ముందే.. సరిగ్గా 39 సెకన్లకే దానికి తోడుగా మరో భీకరమైన 7.5 తీవ్రతతో రెండో భూకంపం ముంచెత్తింది. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో దీని ప్రభావం ఊహించని స్థాయిలో పెరిగింది.హాహాకారాలు.. రన్‌వేల నుంచి వీధుల దాకా ఒకటే పరుగులు..భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో రాజధాని కారకాస్‌తో పాటు మొరోన్, మైకేటియా నగరాలు తీవ్రంగా దద్దరిల్లాయి. మైకేటియా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అటూ ఇటూ పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లో వస్తువులన్నీ ఒక్కసారిగా కిందపడిపోయాయి. భీకరమైన శబ్దం వచ్చింది. నా జీవితంలో ఇంతటి భయంకరమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంపం, సునామీ కోరల్లో ఆసియా దేశాలుకూలిన భవనాలు.. వేలాది మంది ప్రాణాలు గాల్లోనేనా?ఈ భూకంప తీవ్రతకు వందలాది ఇళ్లు, ఎత్తైన భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ ఘోర విపత్తుపై స్పందించిన అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ విపత్తులో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, మరణాల సంఖ్య 10,000 నుంచి ఏకంగా ఒక లక్ష వరకు ఉండే ప్రమాదం ఉందని ప్రాథమిక అంచనా వేసింది. దేశంలోని ట్రుజిల్లో, యారకుయ్, కరాబోబో, మిరాండా వంటి పలు రాష్ట్రాలు ఈ భూకంప ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ భూకంపం- వణికిన తూర్పు తీరంసునామీ అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం..భూకంపం ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో అధికారులు