ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం
Actor ProfilePolitician

ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం

Total News1
Movie Updates0
Sources1
ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం
Andhra Jyothy18 Jun 2026
ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం

2024 ఎన్నికల విజయం తెలుగు నేలపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ విజయంలో ప్రవాసాంధ్రుల కృషిని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రస్తావిస్తుంటారని తెలిపారు. వాషింగ్టన్: 2024 ఎన్నికల విజయం తెలుగు నేలపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ తెలిపారు. ఈ విజయంలో ప్రవాసాంధ్రుల కృషిని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రస్తావిస్తుంటారని చెప్పారు. అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియా వేదికగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌తో ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సమర్ధ నాయకత్వంలో పలు రంగాలలో రాష్ట్రాభివృద్ధి చెందుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో నూతన సంస్కరణలతో విద్య రంగం పురోగామి దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఇటీవలి విడుదలైన పదో తరగతి ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన సోదాహరణగా వివరించారు. ప్రజాభిమానం తోడుగా నగరి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నుంచి ఈనాటి వరకూ దశాబ్దాలుగా విలువలతో కూడిన ప్రజాసేవలో తాము ముందుకు సాగుతున్నామన్నారు. 2029 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పని చేద్దామని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాశ్ పిలుపునిచ్చారు. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజకీయ జీవితం అందరికి మార్గదర్శకమని పేర్కొన్నారు. యువ శాసనసభ్యుడిగా ప్రజాసేవలో ఆ వారసత్వాన్ని, విజయాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే భానుప్రకాశ్‌కు ఆయన సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ పిలుపు మేరకు ఎల్లప్పుడూ టీడీపీ విజయమే తమకు శిరోధార్యం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా మాగులూరి భానుప్రకాశ్ వ్యవహరించారు