ఉండవల్లి ఘటన..వైసీపీ నేతల
Actor ProfilePolitician

ఉండవల్లి ఘటన..వైసీపీ నేతల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉండవల్లి ఘటన..వైసీపీ నేతలపై 3 కేసులు నమోదు
TeluguOne6 Aug 2026
ఉండవల్లి ఘటన..వైసీపీ నేతలపై 3 కేసులు నమోదు

రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉండవల్లి పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ రగడపై సీరియస్‌గా స్పందించిన తాడేపల్లి పోలీసులు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా మూడు వేర్వేరు క్రిమినల్ కేసులను నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ గొడవలకు సంబంధించి పెనుమాక ప్రాంతానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు పలువురు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం స్థానికుల ఫిర్యాదులే కాకుండా, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగినందుకు కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ బృందం పర్యటించే సమయంలో భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐ వీరేంద్రబాబును నెట్టివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సదరు పోలీస్ అధికారి స్వయంగా ఫిర్యాదు చేయడంతో, అంబటి రాంబాబుపై పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం అదనంగా మరో కేసు నమోదైంది. మరోవైపు వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కాకుండా ప్రతిపక్ష నేతలు, రైతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యటనలో ఉన్న వైసీపీ నాయకుడు నారాయణమూర్తి వాహనంపై కొందరు దుండగులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీనిపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కొందరు అమరావతి రైతులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఘర్షణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పర్యటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన గుంపుపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. కొందరు వ్యూహాత్మకంగా రాళ్లదాడికి పాల్పడి, అమరావతి ప్రాంత