ఈట్ ఫాస్ట్
Actor ProfilePolitician

ఈట్ ఫాస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈట్ ఫాస్ట్ , ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ
Sakshi1 Jul 2026
ఈట్ ఫాస్ట్ , ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ

కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్‌ కల్చర్‌, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్ నోటీసుసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. ఉద్యోగులు లంచ్ బ్రేక్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే వారికి పెనాల్టీ విధిస్తామంటూ ఒక ఆఫీస్ బోర్డుపై పెట్టిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది పని సంస్కృతి (workplace culture) , ఉద్యోగుల హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇంతకీ నోటీసులో ఏముంది? ఈ నోటీసు ఏ కంపెనీకి చెందిందో స్పష్టంగా లేదు కానీ, అందులోని నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగులకు కేటాయించిన 30 నిమిషాల లంచ్ బ్రేక్ సమయం దాటితే, ఆ అదనపు సమయానికి బదులుగా జీతం లేని అదనపు గంటలు (unpaid work hours) పని చేయాల్సి ఉంటుంది. లంచ్ బ్రేక్ 30 నిమిషాల కంటే ఒక నిమిషం ఎక్కువైనా సరే... దానికి బదులుగా సాయంత్రం 6 గంటల తర్వాత కంపెనీ కోసం 60 నిమిషాల పాటు ఉచితంగా 'ఫోకస్ టైమ్' (Unpaid Focus Time) కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ 31 నిమిషాలు లంచ్ బ్రేక్ తీసుకుంటే, సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వాళ్లు 7:00 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి. అందుకే "త్వరగా తినండి" (Eat faster) అంటూ నోటీసు చివరలో ఘాటు హెచ్చరిక కూడా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం నెటిజన్ల తీవ్ర ఆగ్రహం నెటిజన్లు కంపెనీ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, అనాగరికమని విమర్శిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే గంట సేపు ఉచితంగా పని చేయడం, ఓకే మరి, ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత ఉద్యోగి ఒక్క నిమిషం