
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్ కల్చర్, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి.
Jun 22 2026 4:50 PM | Updated on Jun 22 2026 5:04 PM
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్ కల్చర్, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్ నోటీసుసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే..
ఉద్యోగులు లంచ్ బ్రేక్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే వారికి పెనాల్టీ విధిస్తామంటూ ఒక ఆఫీస్ బోర్డుపై పెట్టిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది పని సంస్కృతి (workplace culture) , ఉద్యోగుల హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఇంతకీ నోటీసులో ఏముంది? ఈ నోటీసు ఏ కంపెనీకి చెందిందో స్పష్టంగా లేదు కానీ, అందులోని నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగులకు కేటాయించిన 30 నిమిషాల లంచ్ బ్రేక్ సమయం దాటితే, ఆ అదనపు సమయానికి బదులుగా జీతం లేని అదనపు గంటలు (unpaid work hours) పని చేయాల్సి ఉంటుంది. లంచ్ బ్రేక్ 30 నిమిషాల కంటే ఒక నిమిషం ఎక్కువైనా సరే... దానికి బదులుగా సాయంత్రం 6 గంటల తర్వాత కంపెనీ కోసం 60 నిమిషాల పాటు ఉచితంగా 'ఫోకస్ టైమ్' (Unpaid Focus Time) కేటాయించాల్సి ఉంటుంది.
ఒకవేళ 31 నిమిషాలు లంచ్ బ్రేక్ తీసుకుంటే, సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వాళ్లు 7:00 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి. అందుకే "త్వరగా తినండి" (Eat faster) అంటూ నోటీసు చివరలో ఘాటు హెచ్చరిక కూడా ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం నెటిజన్లు కంపెనీ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, అనాగరికమని విమర్శిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే గంట సేపు ఉచితంగా పని చేయడం, ఓకే మరి, ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత ఉద్యోగి ఒక్క నిమిషం ఎక్కువ పనిచేసినా ఒక గంట అదనపు జీతం ఇస్తారా . సాయంత్రం 6:01 వరకు ఉంటే గంట జీతం ఇవ్వాలి అంటూ కొంతమంది కౌంటరిచ్చారు.
ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?
నోటీసు నిజమేనా? ఈ నోటీసుపై కంపెనీ పేరు గానీ, ఎలాంటి లోగో గానీ లేకపోవడంతో ఇది నిజమైనదేనా లేక కేవలం సోషల్ మీడియాలో లైకులు, అటెన్షన్ కోసం క్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. "ఒకవేళ 5 నిమిషాలు త్వరగా లంచ్ ముగించుకుని వస్తే.. 5 గంటల లీవ్ ఇస్తారా?" అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు.
చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్డే స్పెషల్( ఫొటోలు)
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు