ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు
Actor ProfilePolitician

ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు

Total News3
Movie Updates0
Sources1
ఉచిత బస్సు పథకం వేళ కేరళ మంత్రి తలపై పడిన పాయసం
Andhra Jyothy15 Jun 2026
ఉచిత బస్సు పథకం వేళ కేరళ మంత్రి తలపై పడిన పాయసం

కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం కేరళం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రియదర్శని స్కీమ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి బిందు కృష్ణ సోమవారంనాడు స్వయంగా బస్సు ఎక్కి

టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ
Andhra Jyothy15 Jun 2026
టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శుక్రవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు

ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు
Andhra Jyothy15 Jun 2026
ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గనుక ఇప్పుడు బతికుంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్/న్యూఢిల్లీ, జూన్ 15: దేశ రాజకీయాల్లో సరికొత్త వివాదం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గనుక ఇప్పుడు బతికుంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి హిందువులన్నా, హిందూత్వ అన్నా తీవ్ర ద్వేషమని మండిపడింది. జైపూర్‌లో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అశోక్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఉన్న వాతావరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి 'అత్యంత ప్రమాదకరమైన' వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. 'నేను పూర్తి బాధ్యతతో ఈ మాట చెబుతున్నాను.. దేశంలో ప్రస్తుత వాతావరణం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. దేశ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా మతపరమైన ధ్రువీకరణకు పాల్పడుతున్నారు' అని అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. 'దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఒక ఐదు సీట్లు ఇవ్వాల్సింది. కానీ తాము కేవలం 'ప్యూర్ హిందూత్వ పార్టీ' అని ప్రొజెక్ట్ చేసుకోవడమే వారి ఉద్దేశం. కేవలం హిందూత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించాలనేదే వారి ఆలోచన. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నాయకురాలు నేడు బతికుంటే ఇలాంటి పార్టీపై నిషేధం విధించేవారు. కేవలం హిందువుల పేరుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా?' అని ఆయన