
క్యాన్సర్‌తో పోరాడుతూ.. అదీ 69 ఏళ్ల వయసులో.. ట్రెక్కింగ్ లాంటివి చేయడమంటే చెప్పుకోవాల్సిన విషయమే. తాజాగా ఇలాంటి ప్రయత్నమే చేశారు అలనాటి నటి నఫీసా అలీ. ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమెకు.. ఇప్పటికే పలుమార్లు కీమోథెరపీ, ఓసారి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. క్యాన్సర్‌తో పోరాడుతూ.. అదీ 69 ఏళ్ల వయసులో.. ట్రెక్కింగ్ లాంటివి చేయడమంటే చెప్పుకోవాల్సిన విషయమే. తాజాగా ఇలాంటి ప్రయత్నమే చేశారు అలనాటి నటి నఫీసా అలీ. ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమెకు.. ఇప్పటికే పలుమార్లు కీమోథెరపీ, ఓసారి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఇలా ఆస్పత్రి వాతావరణం, ఈ ఒత్తిళ్ల నుంచి బయటికొచ్చి కాసేపు ప్రకృతిలో సేదదీరాలనుకున్నారామె. ఈ క్రమంలోనే తన కుటుంబం, స్నేహితులతో కలిసి ఇటీవలే రోహ్‌తంగ్ పాస్ వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లారు. వయసు, అనారోగ్యాన్ని పక్కన పెట్టి చేసిన ఈ ప్రయత్నం గురించి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ఇదో సరికొత్త అనుభవం..’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. కోల్‌కతాలో పుట్టిన నఫీసా.. అందాల రాణిగా, నటిగా, సామాజిక కార్యకర్తగా ఎంతోమందికి సుపరిచితం. 1976లో ‘ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా’ టైటిల్ గెలిచిన ఆమె.. అదే ఏడాది ‘మిస్ ఇంటర్నేషనల్’ అందాల పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి రెండో రన్నరప్‌గా నిలిచారు. ఆపై పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. అయితే 2018లో పెరిటోనియల్ (పొత్తికడుపు లోపలి పొర కణజాలంలో వచ్చే క్యాన్సర్), అండాశయ క్యాన్సర్ల బారిన పడ్డారు నఫీసా. అప్పటికే మూడో దశలో ఉన్న ఈ మహమ్మారి నుంచి 2019లో కోలుకున్నారు. అయితే గతేడాది అక్టోబర్‌లో తనకు క్యాన్సర్ తిరగబెట్టినట్లు ప్రకటించారామె. పెరిటోనియల్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. దీన్నుంచి బయటపడేందుకు ఇప్పటికే పలుమార్లు కీమోథెరపీ చేయించుకున్న నఫీసాకు ఇటీవలే వైద్యులు ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం 69 ఏళ్ల వయసున్న