అసేతు హిమాచలం యోగా చైతన్యం.. '20 ఏళ్లనాటి ఫ్లెక్సిబిలిటీ నాది
Actor ProfilePolitician

అసేతు హిమాచలం యోగా చైతన్యం.. '20 ఏళ్లనాటి ఫ్లెక్సిబిలిటీ నాది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అసేతు హిమాచలం యోగా చైతన్యం.. '20 ఏళ్లనాటి ఫ్లెక్సిబిలిటీ నాది
Oneindia Telugu22 Jun 2026
అసేతు హిమాచలం యోగా చైతన్యం.. '20 ఏళ్లనాటి ఫ్లెక్సిబిలిటీ నాది

హిమాలయాల ఉత్తర శిఖరాల నుంచి హిందూ మహాసముద్రపు దక్షిణ తీరాల వరకు ఆదివారం దేశమంతా యోగా చైతన్యంతో పులకించిపోయింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కోట్లాది మంది యోగాసనాల్లో లీనమయ్యారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని, ఇది ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing) అనే ప్రత్యేక థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరిగాయి. కేవలం జీవనకాలాన్ని పెంచడమే కాకుండా, శారీరక, మానసిక దృఢత్వంతో కూడిన నాణ్యమైన జీవనాన్ని అందించడమే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.వయసు పెరిగినంత మాత్రాన మనిషిలోని సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు తగ్గిపోకూడదని, నిరంతర ఎదుగుదలకు యోగా ఒక అద్భుతమైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలను, ప్రపంచ మానవాళిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ఏడాది ఎంచుకున్న ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing) అనే అంశం కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాదని, ఇది ప్రతి ఒక్కరిలో జీవితకాల ఆరోగ్య చైతన్యాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. వేలాది మంది ఉత్సాహవంతులతో కలిసి ఆయన యోగాసనాలు వేస్తూ దేశప్రజల్లో స్ఫూర్తిని నింపారు. 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ తెచ్చిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడంతో ప్రారంభమైన ఈ గ్లోబల్ జర్నీ, నేడు ప్రపంచ సంక్షేమ ఉద్యమంగా మారింది.ప్రపంచాన్ని ఏకం చేస్తున్న యోగా శక్తిభౌగోళిక సరిహద్దులు, సంస్కృతీ సంప్రదాయాల విభేదాలను అధిగమించి మానవాళిని ఏకం చేసే గొప్ప శక్తి యోగాకు ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. భారతదేశంలో హిమాలయ శిఖరాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, తూర్పున ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్ నుండి పడమరన సౌరాష్ట్ర (గుజరాత్) వరకు దేశమంతా