తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మాజీ గవర్నర్ ఆర్.ఎన్. రవి హయాంలో అధికారిక కార్యక్రమాల క్రమం విషయంలో జరిగిన వివాదాలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆర్లేకర్ పునరావృతం చేస్తారేమోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో రాష్ట్ర గీతం 'తమిళ్ తాయ్ వాళ్తు'తో సమావేశాలను ప్రారంభించి సంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే, సంప్రదాయానికి భిన్నంగా ఆ వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మాత్రమే జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దీంతో ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.అనంతరం గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తన ప్రసంగం ప్రారంభించారు. టీవీకే ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను గవర్నర్ చదివి వినిపించారు. జనగణనలో భాగంగా కులగణను పూర్తి చేయాలని, రాష్ట్రంలో సామాజిక న్యాయ సర్వే నిర్వహణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం అవసరమని, జాతీయ కుల గణన పూర్తయిన తర్వాత దీనిని అమలు చేస్తామని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు.గవర్నర్ ప్రసంగంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఒక ప్రధాన అంశంగా నిలిచాయి. కేంద్రం నుంచి పన్నుల వాటాలో తమిళనాడుకు దక్కాల్సిన న్యాయమైన వాటాను డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, అవసరమైతే ఈ సమస్యపై సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు వీలుగా న్యాయ నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే తమిళనాడు పట్ల అనుసరిస్తున్న ఆర్థిక వివక్షను పత్రాలతో సహా వివరిస్తూ ఒక నివేదికను ప్రచురించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.అలాగే, ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయాన్ని ఒక విప్లవాత్మక రాజకీయ ఘట్టంగా ప్రసంగంలో అభివర్ణించారు. డబ్బు, అధికార బలాన్ని తట్టుకొని సాధించిన ఈ విజయాన్ని ఒక చారిత్రాత్మక ప్రజా తీర్పుగా పేర్కొన్నారు. పారదర్శక పాలన, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పరిపాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను
Samayam Telugu•18 Jun 2026
అవినీతిపై పోరాటం, కులగణన సహా కీలక అంశాలు.. రోడ్ మ్యాప్ ప్రకటించిన సీఎం విజయ్