అంగన్ వాడీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 15
Actor ProfilePolitician

అంగన్ వాడీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 15

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంగన్ వాడీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 15,982 ఖాళీలు.. ఎంపిక విధానం, అర్హతలు ఇవే
Samayam Telugu3 Jul 2026
అంగన్ వాడీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 15,982 ఖాళీలు.. ఎంపిక విధానం, అర్హతలు ఇవే

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. మొత్తం 33 జిల్లాల్లో భారీ సంఖ్యలో 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 3100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు ఉండగా.. 12,882 అంగన్‌వాడీ సహాయకుల పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా ఖాళీలను పక్కాగా గుర్తించి, జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మల్టీజోన్‌-1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్‌-2పరిధిలోని 15,197 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 సహాయకులు కలిపి మొత్తం 6,392 ఖాళీలు ఉన్నాయి.ఈ నియామక ప్రక్రియ ఇప్పటికే వేగం పుంజుకుంది. పెద్దపల్లి జిల్లాలో టీచర్‌ పోస్టుల భర్తీకి.. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 4 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి మొత్తం 177 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అధికారిక ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో స్థానిక అవసరాలకు అనుగుణంగా వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. వాస్తవానికి ఈ పోస్టులను భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వం భావించినప్పటికీ, నియామక విధానంలో పారదర్శకత కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీసు నిబంధనలపై సుదీర్ఘ అధ్యయనం చేసింది. తుది నివేదికల ఆధారంగా అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేలా సరికొత్త నియామక నిబంధనలను ఖరారు చేసింది.కొత్తగా ఇంటర్వ్యూ విధానం..కేంద్ర ప్రభుత్వ సాక్ష్యం అంగన్‌వాడీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి విద్యా అర్హతల్లో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న అర్హతలను సవరిస్తూ.. అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్‌ను