ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ, జూన్...

ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ, జూన్...

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. భారత బ్యాడ్మింటన్‌కు మరో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఈ స్టార్ జంట దేశానికి గర్వకారణంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ప్రపంచ వేదికపై భారత్‌కు మరోసారి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చాయని.. వారి అద్భుత ప్రతిభ, అచంచల పట్టుదల, నిరంతర కృషికి ఈ విజయం నిదర్శనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి విజయంపై ప్రత్యేకంగా గర్విస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సాధిస్తున్న విజయాలు రాష్ట్ర యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు. భారత బ్యాడ్మింటన్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న ఈ జోడీ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశం కోసం మరిన్ని పతకాలు, టైటిళ్లు సాధించి భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టించాలని శుభాకాంక్షలు తెలిపారు.

సాత్విక్ విజయం గర్వకారణం:ఎంపీ సానా సతీశ్

సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సాత్విక్ సాయిరాజ్ విజయంపై తెలుగుదేశం ఎంపీ సానా సతీశ్ హర్షం వ్యక్తం చేశారు. పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు క్రీడాకారుడు, అమ లాపురానికి చెందిన సాత్విక్ విజయం గర్వకారణమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారతదేశానికి స్వర్ణ పతకాన్ని అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. సాత్విక్ విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, క్రీడల పట్ల అంకితభావం, కఠోర

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగుజాతి సెంటిమెంట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు. అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) తెలుగుజాతి సెంటిమెంట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) మంగళగిరిలో జరుగుతున్న మహానాడు వేడుకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు నివాళులు అర్పించారు. 1,875 క్లస్టర్ల నుంచి మహానాడుకు టీడీపీ నేతలు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడులో ఆయనకు నివాళి అర్పించే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో ప్రతిపాదించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఎన్టీఆర్‌ను సత్కరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా.. రైతుకు నేస్తమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే అన్నివర్గాలు ప్రేమించే నాయకుడని ప్రశంసించారు. సాధారణ ఉద్యోగిగా మొదలై, సినిమా స్టార్‌గా ఎదిగి, ప్రజల కోసం పార్టీ పెట్టి సీఎంగా ఎదగడం ఎన్టీఆర్‌కే సాధ్యమని కీర్తించారు. ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎన్టీఆర్ ఎప్పుడూ వీడలేదని తెలిపారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనేదే ఎన్టీఆర్ సిద్ధాంతమని పేర్కొన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ జయంతి తెలుగువారందరికీ పండుగ రోజు అని తెలిపారు. సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి సినీ జీవితంతో పాటు రాష్ట్ర

మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఘాటు విమర్శలు చేశారు. ‘వేట కొడవళ్ల నుంచి గొడ్డళ్లకు మారడం వైసీపీ విధానం... ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం మన విధానం... బోత్ ఆర్ నాట్ సేమ్. నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్’ అంటూ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులే ‘క్రూయల్ మెంటాలిటీ’కి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లెగసీ వేస్ట్ క్లీన్ చేశామని... డోర్ టూ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని, ఆస్తుల భద్రత కోసం ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్‌తో బ్లాక్‌చైన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాలు కూడా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో యుద్ధం జరిగిందని... ఏపీలో గ్యాస్ సమస్య వచ్చిందని ప్రస్తావించారు. ఆక్వా, అరటికి రేట్లు పడిపోయాయని చెప్పారు. సంక్షేమాన్ని అవకాశంగా మార్చి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నామని వివరించారు. యువతకు కావాల్సింది గొడ్డలి వేటు కాదని... ఉద్యోగాలని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో ‘గొడ్డలి పార్టీ’ వచ్చిందని విమర్శించారు. ‘ఐటీ నుంచి క్వాంటంకు మారడం మన నినాదం’ అంటూ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపైనే తమ దృష్టి అని తెలిపారు. పార్టీ కేడర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని

విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్తానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్తానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసింది.. 1875 క్లస్టర్‌ల వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని ప్రశంసించారు. పశ్చిమాసియా యుద్ధవాతావరణం మూలంగా మహానాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు’ అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసిందని ప్రస్తావించారు. జెండర్ ఈ క్వాలిటీ, సామాజిక సమస్యలపై తెలుగుదేశం పోరాడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ... కార్యకర్తల్లో జోరు తగ్గలేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహించుకుంటున్నామని తెలిపారు. యుద్ధం వల్ల మహానాడును హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహించుకుంటున్నామని వివరించారు. మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం మారలేదని అన్నారు. భవిష్యత్తు గురించి అన్ని విషయాలు చర్చించుకుందామని తెలిపారు. కూడు, గూడు నీడ లాంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించిందని అన్నారు. విజన్ పాలిటిక్స్‌కు రూపమని.. టీడీపీ