హైదరాబాద్ లో ఘనంగా వెటా’ ప్రారంభ కార్యక్రమం
Actor ProfilePolitician

హైదరాబాద్ లో ఘనంగా వెటా’ ప్రారంభ కార్యక్రమం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో ఘనంగా వెటా’ ప్రారంభ కార్యక్రమం
Telugu Times25 Jul 2026
హైదరాబాద్ లో ఘనంగా వెటా’ ప్రారంభ కార్యక్రమం

మహిళా సాధికారత, అభివృద్ధి మరియు నాయకత్వ వికాసమే లక్ష్యంగా అమెరికాలో విజయవంతంగా కొనసాగుతున్న ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) సేవలు ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అట్టహాసంగా జరిగిన వేటా ఇండియా ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మరియు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి వెటా ఫౌండర్ మరియు చైర్‌పర్సన్ ఝాన్సీ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు భారతీయ మహిళా జాతీయ సమాఖ్య సీనియర్ లీడర్ ప్రేమ్ పావని, భారతీయ మహిళా మోర్చా తెలంగాణ శాఖ అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మరియు వెîటా ప్రతినిధులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అభితేజ కొండ, సునీత గంపా, శైలజా కల్లూరి, విశ్వ వేమిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అవకాశం,ప్రోత్సాహం లభిస్తే ప్రతి రంగంలోనూ వారు అద్భుత విజయాలు సాధించగలరని అన్నారు. మహిళా సాధికారతకు వెటా వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇటువంటి వేదికలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సాధికారత పై హనుమండ్ల ఝాన్సీ ఇండియాలో వెటాసంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అన్ని రంగాల్లో తము ఉన్నామంటూ మహిళలు రాణిస్తున్నారన్నారు. రవాణా శాఖ కి మహిళలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలను బస్సు యాజమానులుగా చేశామని, ఉచిత ప్రయాణమే కాదు బస్సులు యజమానులు అయ్యారన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ