హైదరాబాద్ రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు.. అమెరికా అధ్యక్షుడి రియాక్షన్ ఇదే
Actor ProfilePolitician

హైదరాబాద్ రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు.. అమెరికా అధ్యక్షుడి రియాక్షన్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు.. అమెరికా అధ్యక్షుడి రియాక్షన్ ఇదే
Zee Telugu31 Jul 2026
హైదరాబాద్ రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు.. అమెరికా అధ్యక్షుడి రియాక్షన్ ఇదే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Hyderabad Donald Trump Avenue President Reacts: జూన్ 23, 2026న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని యుఎస్ కన్సులేట్‌కు ఆనుకొని ఉన్న ఒక ప్రధాన రహదారిని 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక కొన్ని వ్యూహాత్మక అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ పేరు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. డిసెంబర్‌లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ముందు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని తిప్పుకోవాలనే లక్ష్యంతో ఈ ఆలోచన చేశారు. దీనిని ప్రతిపాదించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అమెరిక సంస్థలతో నిండిపోయిన హైదరాబాద్ నగరాన్ని 'సైబరాబాద్' అని కూడా పిలుస్తారు, అందుకే ఆ అమెరికా అధ్యక్షుడి పేరును ఈ రోడ్డుకు పెట్టారు. ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అగ్రనేత ఇలా రాసుకొచ్చారు.. "భారతదేశంలోని హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని కొత్తగా పేరు పెట్టారు. నాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు. ఇలా గౌరవించబడిన మొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే" అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఈ రోడ్డుకు పేరు పెట్టే కార్యక్రమంలో అమెరికా రాయబారి సెర్గియో, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని, 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' ఫలకాన్ని లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. అమెరికా 'ఫ్రీడం 250' వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు, దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రక్షణ, ఏరోస్పేస్ రంగాల నాయకులు పాల్గొని, అమెరికా-భారత్ బంధాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రాముఖ్యత