US Strike Oman Coast Ship : ఒమన్ గల్ఫ్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతికి కారణమైన వాణిజ్య నౌక ‘ఏటీ సెట్టెబెల్లో’పై అమెరికా సైనిక దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలావు ఫ్లాగ్ కలిగిన ఈ నౌకపై అమెరికా దళాలు విరుచుకుపడటానికి ముందు.. ఏకంగా 60 సార్లు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కనీసం ఎనిమిది సార్లు సైనిక బలప్రదర్శన చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ నౌకా సిబ్బంది వాటిని పూర్తిగా బేఖాతరు చేయడంతోనే.. ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే..? అమెరికా రక్షణ నివేదికల ప్రకారం.. సదరు నౌక ఇరాన్ చమురును అక్రమంగా రవాణా చేస్తూ అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న షాడో ఫ్లీట్‌లో భాగమని అమెరికా నావికులు గుర్తించారు. గత రెండు వారాలుగా అమెరికా దళాలు ఈ నౌకతో డజన్ల కొద్దీ సార్లు సంప్రదింపులు జరిపాయి. బుధవారం జరిగిన తుది దాడికి ముందు.. ఫ్లేర్లు విసరడం, యుద్ధ విమానాలతో ఫ్లైఓవర్లు చేయడం వంటి చర్యల ద్వారా హెచ్చరించారు. చివరకు నౌకను నిలిపి వేయడానికి దాని ఇంజన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానం ప్రెసిషన్ మునిషన్స్ దాడి చేసింది. ఈ దాడికి ముందు సిబ్బంది ఇంజన్ రూమ్ నుంచి బయటకు రావడానికి 15 నిమిషాల సమయం ఇచ్చామని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అయినప్పటికీ నావికులు స్పందించకపోవడం వల్లే.. దాడి చేశామని తెలిపింది. ఈక్రమంలోనే నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. ముగ్గురు చనిపోయారని పేర్కొంది. భారత్ తీవ్ర నిరసన..!ఈ ఘటనపై న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది. తమ సిబ్బంది మృతి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించి భారత్ గట్టిగా నిలదీసింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ రేవులపై
Actor ProfilePolitician
హెచ్చరికలు, 15 నిమిషాల సమయమిచ్చిన అమెరికా.. అయినా వెనక్కి తగ్గకపోవడంతోనే భారత్ ఓడ
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
హెచ్చరికలు, 15 నిమిషాల సమయమిచ్చిన అమెరికా.. అయినా వెనక్కి తగ్గకపోవడంతోనే భారత్ ఓడపై దాడి