
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకురాలు. ఈ మూవీ టీమ్‌తో స్పెషల్ చిట్ చాట్. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత (Samantha), రాజ్ నిడిమోరు (Raj Nidimoru), హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, విడుదలకు అన్ని విధాలా ఈ సినిమా సిద్ధమైంది. ఈ క్రమంలో సమంత అండ్ టీమ్ యమా జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. సమంత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ రికార్డ్ ఏమిటంటే.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత ఒకే రోజు 40 ఇంటర్వ్యూలలో పాల్గొనడం. ఇప్పటి వరకు ఏ స్టార్ చేయని ఫీట్‌ని ఆమె సాధించి, సినిమా అంటే ఆమెకు ఎంతో ఇష్టమో తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఆమె ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని విశేషాలను తెలియజేశారు. సమంత 3 ఏళ్ల బ్రేక్ గురించి మాట్లాడుతూ.. కెరీర్ మొదలైనప్పటి నుంచి ఒక రేస్‌లాగా ఏడాదికి 5 సినిమాలు చేస్తే.. అందులో రెండో, మూడో సక్సెస్‌లు అవుతుండటంతో కెరీర్ సాఫీగా సాగిపోయింది. కానీ, తీసుకున్న బ్రేక్‌తో అసలు ఈ రేస్ ఎవరి కోసం, ఎవరితో పోటీ అనేది అర్థమైంది. ఇప్పుడు కేవలం సెట్‌లో ఎంజాయ్ చేసేలా, ప్రేక్షకులకు 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా, నాలో ఇంప్రూవ్‌మెంట్ కనిపించేలా ఉండే