
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Best Retirement Schemes: రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛను, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలవారీ ఆదాయం చాలా అవసరం అవుతుంది. వ్రుద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర రోజు వారీ అవసరాలకు కచ్చితంగా ఆదాయ వనరు ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పాలి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి హెచ్చుతగ్గులు ఉండే మార్కెట్ ఆధారిత పెట్టుబడుల కంటే మూలధనాన్ని భద్రంగా ఉంచుతూ సరైన వడ్డీని క్రమం తప్పకుండా అందించే ప్రభుత్వ పథకాల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సురక్షితమైన ప్రభుత్వ పథకాలలో సరైన ప్రణాళికతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని ఏ విధంగా పొందవచ్చో తెలుసుకుందాం. పదవీ విరమణ తర్వాత రాబడి కొంచెం తక్కువ అయినా సరే పెట్టుబడి పెట్టిన కష్టార్జితం సురక్షితంగా ఉండాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా పర్యవేక్షించే స్కీమ్స్ మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఆర్బిఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ వంటి స్కీమ్స్ 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తూ స్థిరమైన ఆదాయానికి బాటలు వేస్తున్నాయని చెప్పాలి. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన విశ్వసనీయమైన పొదుపు స్కీం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకంలో సాధారణంగా 8శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తుంది. ప్రభుత్వ గ్యారెంటీ ఉండడంతో ఇందులో ఎలాంటి నష్టభయము