
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Best Retirement Schemes: రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛను, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలవారీ ఆదాయం చాలా అవసరం అవుతుంది. వ్రుద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర రోజు వారీ అవసరాలకు కచ్చితంగా ఆదాయ వనరు ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పాలి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి హెచ్చుతగ్గులు ఉండే మార్కెట్ ఆధారిత పెట్టుబడుల కంటే మూలధనాన్ని భద్రంగా ఉంచుతూ సరైన వడ్డీని క్రమం తప్పకుండా అందించే ప్రభుత్వ పథకాల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సురక్షితమైన ప్రభుత్వ పథకాలలో సరైన ప్రణాళికతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని ఏ విధంగా పొందవచ్చో తెలుసుకుందాం.
పదవీ విరమణ తర్వాత రాబడి కొంచెం తక్కువ అయినా సరే పెట్టుబడి పెట్టిన కష్టార్జితం సురక్షితంగా ఉండాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా పర్యవేక్షించే స్కీమ్స్ మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఆర్బిఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ వంటి స్కీమ్స్ 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తూ స్థిరమైన ఆదాయానికి బాటలు వేస్తున్నాయని చెప్పాలి.
వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన విశ్వసనీయమైన పొదుపు స్కీం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకంలో సాధారణంగా 8శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తుంది. ప్రభుత్వ గ్యారెంటీ ఉండడంతో ఇందులో ఎలాంటి నష్టభయము ఉండదు. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అలాగే ప్రతినెలా క్రమం తప్పకుండా చేతికి ఆదాయం కావాలనుకునే వారికి ఈ పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం అద్భుతమైన ఎంపిక అని చెప్పాలి.
తక్కువ రిస్క్ ఉండే ఈ స్కీం లో పోస్ట్ ఆఫీస్ ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. స్థిరమైన నెలలవారీ వడ్డీని కూడా పొందవచ్చు. వీటితోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆర్బిఐ ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్స్ పై వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితిని బట్టి ఇది మారుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇది సాధారణంగా 8 శాతం ఎక్కువ రాబడి అందిస్తూ దీర్ఘకాలిక భద్రతను అందిస్తుందని చెప్పాలి.
ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం మీరు ఇన్వెస్ట్ దానికి కేవలం ఒకే స్కీం లో కాకుండా ఈ 3 సురక్షిత పథకాల్లో కలిపి సుమారు 1.5 కోట్లు పెట్టుబడి పెడితే సుమారు నెలకు లక్ష స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. దాని అంచనాలు లెక్కల ప్రకారం ముందుగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ లో గరిష్టంగా 60 లక్షల వరకు పెట్టుబడి పెడితే 8.2 శాతం వడ్డీ రేటు తో ఏడాదికి సుమారు 4.9 లక్షల రాబడి అందిస్తుంది. అంటే దీని ద్వారా నెలకు 40, 800 ఆదాయం మీ చేతికి అందుతుంది
అదేవిధంగా ఆర్బిఐ ఫ్లోటింగ్ బాండ్స్ లో 75 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 8.05% వడ్డీ రేటు తో ఏడాదికి సుమారు 6 లక్షల రాబడి వస్తుంది. దీని ద్వారా నెలకు అదనంగా మరో 50 వేల ఆదాయం పొందవచ్చు. ఇక పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో గరిష్ట పరిమితికి లోబడి 15 లక్షల పెట్టుబడి పెడితే సుమారు 7.4% వడ్డీలతో ఏడాదికి 1.1 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. అంటే నెలకు దాదాపు 9,200 లభిస్తుంది అని చెప్పాలి.
ఈ మూడు ప్రభుత్వ స్కీం లో కలిపి పెట్టుబడి పెట్టినట్లయితే మీ నెలవారీ ఆదాయం సుమారు లక్ష రూపాయలకు చేరుకుంటుంది. ఎలాంటి ఆర్థిక ఆందోళన లేకుండా గౌరవప్రదమైన ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితాన్ని గడిపేందుకు ఈ ఆర్థిక ప్రణాళికలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయని చెప్పాలి
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.