సోది చెప్పి మోసం చేసే టైమ్ అయిపోయింది.. మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులుద్ది’.. హీరో తనీష్ కీలక
Actor ProfilePolitician

సోది చెప్పి మోసం చేసే టైమ్ అయిపోయింది.. మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులుద్ది’.. హీరో తనీష్ కీలక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సోది చెప్పి మోసం చేసే టైమ్ అయిపోయింది.. మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులుద్ది’.. హీరో తనీష్ కీలక
Samayam Telugu18 Jul 2026
సోది చెప్పి మోసం చేసే టైమ్ అయిపోయింది.. మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులుద్ది’.. హీరో తనీష్ కీలక

టాలీవుడ్ హీరో తనీష్ అల్లాడి సినిమాలకు దూరమై చాలా ఏళ్లయింది. ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున ప్రచారం చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తనీష్.. తాజాగా ఎక్స్ లో పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనీష్ కి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో ‘మేం వయసుకు వచ్చాం’ ఒకటి. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 2012లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. జూన్ 23వ తేదీకి ఈ మూవీ వచ్చి 14 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో “మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అంటూ తనీష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమా పోస్టర్ ను పంచుకున్నారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి జక్కిరెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త స్పందిస్తూ.. తనీష్ పై సెటైరికల్ కామెంట్స్ చేశాడు.“హాస్యాస్పదం ఏంటంటే, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ 10వ తరగతి ఫెయిల్ అయిన సినిమా యాక్టర్స్ కింద పనిచేస్తున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సినిమాలో అమ్మాయిలతో డ్యాన్సులు, ఏజ్ అయిపోయాక పాలిటిక్స్ అంటూ పబ్లిక్ తో డ్యాన్సులు చేపిస్తారు. థ్యాంక్ గాడ్. తెలంగాణ ప్రజలు వివేకవంతులు, వారు ఆడంబరాలకు పడిపోరు కానీ జిమ్మిక్కులకు పడిపోతారు. రేవంత్ రెడ్డి ఆ విషయంలో దిట్ట” అని శ్రీనివాస్ రెడ్డి పోస్ట్ పెట్టారు. దీనికి తనీష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.“మిస్టర్.. మీరు ఎవరైనా సరే, ‘హాస్యాస్పదం’ అనేది నిజంగా సరైన పదమే.. ఎందుకంటే తోలకంటి ప్రకాష్ గౌడ్ (5వ తరగతి), గూడెం మహిపాల్ రెడ్డి (8వ తరగతి), బండారు లక్ష్మా రెడ్డి (8వ తరగతి).. ఇలా మీ స్వంత పార్టీ (BRS) నుండి అనేక మందిని

స ద చ ప ప మ స చ స ట మ అయ ప య ద మ లన క ర చ ట క చ పర వ న మ గ ల ద ద హ ర తన ష క లక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in