సంక్షిప్త వార్తలు
Actor ProfilePolitician

సంక్షిప్త వార్తలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంక్షిప్త వార్తలు
Eenadu27 Jun 2026
సంక్షిప్త వార్తలు

‘కాక్‌టెయిల్‌ 2’తో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌.. చిత్రపరిశ్రమలో తొలినాళ్లకు సంబంధించిన విషయాల్ని ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ‘‘నాన్న నటుడు, అమ్మ 15 ఏళ్ల వయసు నుంచే కథక్‌ నర్తకి. మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. నేను పుట్టి పెరిగిన వాతావరణమే నాలో పట్టుదల, లోతైన అవగాహనను నింపింది. సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రత్యేక హక్కులున్న వ్యక్తిని అని ఎప్పుడూ అనుకోలేదు. అయినా నా కెరీర్‌ సులభమైన అవకాశాలతో ప్రారంభం కాలేదు. దానికి బదులుగా చాలా ఏళ్ల పాటు నిరంతర కృషితో శ్రమించాను. 250 ఆడిషన్లు ఇచ్చిన తర్వాతే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. ఆర్థిక పరిమితులు రోజువారీ జీవితంలోని సాధారణ విషయాలను కూడా ప్రభావితం చేస్తాయి. ప్రేక్షకులు నా ఫ్యాషన్‌ సెన్స్‌ బాగుంటుందంటారు.. కానీ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు విన్నప్పుడు నవ్వొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మార్కెట్‌లో బట్టలు కొనడానికి కూడా నా దగ్గర సరిపడా డబ్బులు ఉండేవి కావు. ఆర్థిక ఆందోళనలతో పాటు మానసికంగా కూడా ఇబ్బందిపడ్డాన’’ని అన్నారు. 2003లో ‘ఇష్క్‌ విష్క్‌’ చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు కథానాయకుడు షాహిద్‌. ‘శివ మనసుల శక్తి’ కాంబో అదిరిపోయేలా తిరిగి వచ్చేసింది మచ్చా.. ఈ అద్భుతమైన వినోదాల ప్రయాణానికి సిద్ధమవ్వండ’’ని తమ రాబోయే చిత్ర టీజర్‌ను విడుదల చేసింది ‘జోలియ ఇరుంత ఒరుతన్‌’ సినీబృందం. 16ఏళ్ల కిందట విడుదలైన ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమా తర్వాత దర్శకుడు ఎం రాజేశ్, హీరో జీవా కాంబోలో వస్తున్న చిత్రమిది. ఇవానా కథానాయిక. సుధాకర్, హాసిని పవిత్ర, రేతిక శ్రీనివాస్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళనాడు సీఎం జోసెఫ్‌ విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఆదివారం ఈ సినిమా టీజర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ టీజర్‌.. అగ్రహీరో విజయ్‌ ఓ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్‌ పెళ్లి ఆపి ఆమెని వివాహమాడిన సన్నివేశాలను గుర్తు చేస్తూ సుధాకర్‌.. ‘అప్పుడు పెళ్లి ఆపిన

స క ష ప త వ ర తల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in