స్క్రీన్ ప్లే కింగ్ ’ భాగ్యరాజ్ .. టాప్ 5 సినిమాలు ఇవే
Actor ProfileActor

స్క్రీన్ ప్లే కింగ్ ’ భాగ్యరాజ్ .. టాప్ 5 సినిమాలు ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్క్రీన్ ప్లే కింగ్ ’ భాగ్యరాజ్ .. టాప్ 5 సినిమాలు ఇవే
Eenadu3 Aug 2026
స్క్రీన్ ప్లే కింగ్ ’ భాగ్యరాజ్ .. టాప్ 5 సినిమాలు ఇవే

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి, ఇంటిల్లిపాదీ చూడదగ్గ కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో కె.భాగ్యరాజ్‌ది అందెవేసిన చెయ్యి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేతో కట్టిపడేయడం ఆయన శైలి. అందుకే ఆయన్ను ‘స్క్రీన్‌ప్లే కింగ్‌’ అని అభిమానులు పిలుచుకుంటారు. కె.భాగ్యరాజ్‌(Bhagyaraj) కెరీర్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన 5 చిత్రాలకు సంబంధించిన విశేషాలపై ప్రత్యేక కథనం. అంద 7 నాట్కల్‌ (Andha 7 Naatkal): తమిళ హాస్య నటుడు జె.పి.చంద్రబాబు నిజ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో భాగ్యరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘అంద 7 నాట్కల్‌’. తెలుగులో ‘ఆ 7 రోజులు’ అని అర్థం. భాగ్యరాజ్‌తో పాటు రాజేశ్‌, అంబిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో ‘రాధా కల్యాణం’గా ప్రముఖ దర్శకుడు బాపు రీమేక్‌ చేశారు. ఇందులో చంద్రమోహన్‌, రాధిక, శరత్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీలో ‘వో సాత్‌ దిన్‌’, కన్నడలో ‘లవ్‌ మాడి నోడు’గా రీమేక్‌ అయింది. కథేంటంటే: అంబిక తమ ఇంటి పై పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న రాజేశ్‌ను ప్రేమిస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఆ బంధానికి అడ్డుపడి, అప్పటికే భార్యను కోల్పోయి ఓ బిడ్డకు తండ్రిగా ఉన్న సంపన్నుడైన భాగ్యరాజ్‌తో బలవంతంగా వివాహం చేస్తారు. అయితే తొలిరాత్రే ఆత్మహత్యాయత్నం చేసిన అంబిక తాను రాజేశ్‌ను ప్రేమిస్తున్నట్లు భాగ్యరాజ్‌కు చెబుతుంది. అంబిక స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న భాగ్యరాజ్‌ ఆమెను రాజేశ్‌తో కలుపుతానని మాటిస్తూనే ఓ అభ్యర్థన చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి 7 రోజులకు మించి బతకదని, అప్పటివరకూ తన భార్యలాగే నడుచుకుంటే ఆమె సంతృప్తితో ఈ లోకాన్ని వీడుతుందని చెబుతాడు. అందుకు అంబిక అంగీకరిస్తుంది. ఆ వారం రోజుల్లో భాగ్యరాజ్‌ బిడ్డతో ఆమెకు అనుబంధం పెరుగుతుంది. మరి భాగ్యరాజ్‌ తల్లి మరణించాక, అంబిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తన ప్రేమికుడు రాజేశ్‌తో కలసి జీవించేందుకు భర్తను వీడి వెళ్లిందా? అంబికకు ఇచ్చిన మాటను

స క ర న ప ల క గ భ గ యర జ ట ప 5 స న మ ల ఇవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in