
Raghava Lawrence Political Entry : కోలీవుడ్‌లో మరో భారీ రాజకీయ ప్రకంపన మొదలైంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ మరియు సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు రాజకీయ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. ప్రజలు, అభిమానుల నుంచి వ్యక్తమైన అపూర్వ మద్దతు నేపథ్యంలో.. తన పొలిటికల్ ఎంట్రీపై తాను “సానుకూల నిర్ణయం” తీసుకున్నట్లు లారెన్స్ స్వయంగా ప్రకటించారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. Read Also :CM Vijay Divorce Case: విజయ్ విడాకుల కేసులో నేడే కీలక విచారణ ఆదివారం చెన్నైలోని తన నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అభిమానులతో లారెన్స్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను పంచుకున్నారు. “చాలా కాలంగా నన్ను రాజకీయాల్లోకి రావాలని అనేకమంది ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా ప్రజలే నన్ను ఆహ్వానిస్తుండటంతో నేను ఈ విషయంలో ముందడుగు వేయాలని సానుకూల నిర్ణయం తీసుకున్నాను” అని లారెన్స్ పేర్కొన్నారు.త్వరలోనే తన తల్లి ఆశీస్సులు తీసుకుని, మద్దతుదారులతో ఒక భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించి, పార్టీ పేరు లేదా చేరికకు సంబంధించిన అధికారిక వివరాలను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. లారెన్స్ నేరుగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విజయ్, తన తిరుచ్చి తూర్పు (Trichy East) నియోజకవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో (By-Election) టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్ బరిలోకి దిగుతారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలన్న టీవీకే