సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో
Actor ProfilePolitician

సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో

Total News1
Movie Updates0
Sources1
సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో
AP7AM15 Jun 2026
సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వారు మహాశివుడికి ఈ పూజలు చేశారు.పవిత్రమైన సోమవారం సందర్భంగా, వేద పండితుల మార్గదర్శకత్వంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి, శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం పరమశివుడి ఆశీస్సులు కోరుతూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.రుద్రాభిషేకం అనంతరం లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజల మేలు కోరుతూ మంత్రి దంపతులు ఈ పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీనిపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రుద్రాభిషేకం ఫొటోలను పంచుకున్నారు