విడాకుల కోసం ఐదేళ్లు పోరాడి.. మళ్లీ ఒక్కటై
Actor ProfileCelebrity

విడాకుల కోసం ఐదేళ్లు పోరాడి.. మళ్లీ ఒక్కటై

Total News2
Movie Updates0
Sources1
వ్యాపారికి నకిలీ బంగారం అంటగట్టి.. రూ.6 లక్షలతో ఉడాయించిన జంట
Eenadu14 Jun 2026
వ్యాపారికి నకిలీ బంగారం అంటగట్టి.. రూ.6 లక్షలతో ఉడాయించిన జంట

ఓ వ్యాపారికి నకిలీ బంగారం అంటగట్టి రూ.6 లక్షలతో ఉడాయించిందో జంట. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాంలో చోటుచేసుకుంది. ఫ్యాన్సీ స్టోర్‌ నడుపుతున్న గురుగుబిల్లి జగదీష్‌ దుకాణానికి గుర్తుతెలియని జంట తరచూ వచ్చి

విడాకుల కోసం ఐదేళ్లు పోరాడి.. మళ్లీ ఒక్కటై
Eenadu14 Jun 2026
విడాకుల కోసం ఐదేళ్లు పోరాడి.. మళ్లీ ఒక్కటై

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదేళ్ల పాటు విడాకుల కోసం పోరాడిన జంట మళ్లీ ఒక్కటైన సినిమాను తలపించే ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. కోర్టు గదిలో న్యాయవాదులు వాదనలు వినిపిస్తుండగా దంపతులు (Delhi couple) ఒక్కసారిగా కౌగిలించుకొని కన్నీరు పెట్టుకోవడంతో జడ్జీ సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలేమయ్యిందంటే..? దిల్లీకి చెందిన సౌరభ్‌కు 2020లో శిఖ అనే యువతితో వివాహం అయ్యింది. కొద్ది కాలం తర్వాత వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో విడాకులు (Divorce) తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఐదేళ్లుగా ఫ్యామిలీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. న్యాయవాదుల ఫీజులు, ఇతర ఖర్చలు కారణంగా ఇరువురి కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఈ బాధతో ఇటీవల శిఖ తండ్రికి గుండెపోటు వచ్చింది. డబ్బు అంతా కోర్టు కేసు కోసం ఖర్చు పెట్టడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించలేక ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న సౌరభ్.. శిఖ తండ్రిని గురుగ్రామ్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి.. మెరుగైన వైద్యం అందేలా సాయం చేశాడు. దీంతో ఆయన తిరిగి కోలుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల విడాకుల కేసులో విచారణ కోసం దంపతులు కోర్టు ముందు హాజరయ్యారు. ఇరువురి తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తుండగా.. ‘విడాకులు తీసుకోవాలని ఇప్పటికీ అనుకుంటున్నారా’ అని న్యాయమూర్తి సౌరభ్‌ను అడిగారు. వెంటనే కోర్టు రూములో ఉన్న శిఖ తన వద్ద ఉన్న విడాకుల పత్రాలను చించేసి.. భర్తను హత్తుకొని ఏడవసాగింది. అనంతరం తాము విడాకులు తీసుకోమని..కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని వారు కోర్టుకు తెలియజేయడంతో ఐదేళ్ల సమస్య ఐదు నిమిషాల్లో సుఖాంతమైంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు

వ డ క ల క స ఐద ళ ల ప ర డ మళ ల ఒక కట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in