మంత్రి టీజీ భరత్ ను కలిసిన ఆర్యవైశ్య సంఘం నేతలు
Actor ProfilePolitician

మంత్రి టీజీ భరత్ ను కలిసిన ఆర్యవైశ్య సంఘం నేతలు

Total News1
Movie Updates0
Sources1
మంత్రి టీజీ భరత్ ను కలిసిన ఆర్యవైశ్య సంఘం నేతలు
Vaartha15 Jun 2026
మంత్రి టీజీ భరత్ ను కలిసిన ఆర్యవైశ్య సంఘం నేతలు

TG Bharat | తాడిపత్రి అర్బన్, జూన్ 15 (ప్రభాతవార్త): తాడిపత్రి పర్యటనకు వచ్చిన అనంతపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీజీ భరత్‌ను జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తలుపుల సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇటీవల అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తలుపుల సురేంద్రనాథ్ ఈ నెల 25న జరగనున్న తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి టీజీ భరత్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై కూడా చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించినట్లు సంఘం నాయకులు తెలిపారు. జిల్లా స్థాయిలో ఆర్యవైశ్య సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా మంత్రితో చర్చించినట్లు సమాచారం. మంత్రి టీజీ భరత్‌ను కలిసిన వారిలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు టంగుటూరి శృతి, ప్రధాన కార్యదర్శి తలుపుల శ్రీదేవి, తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వంకదారి రాజా, కమిటీ సభ్యులు గణేష్, రామచంద్రయ్య, సుబ్బరామయ్య, విక్కీ, సముద్రాల సుధాకర్, భూమా సుబ్రహ్మణ్యం, ఎం. నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రి అర్బన్, జూన్ 15 (ప్రభాతవార్త): తాడిపత్రి పర్యటనకు వచ్చిన అనంతపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీజీ భరత్‌ను జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తలుపుల సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. మంత్రి టీజీ భరత్‌ను(TG Bharat) కలిసిన వారిలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు టంగుటూరి శృతి, ప్రధాన కార్యదర్శి తలుపుల శ్రీదేవి, తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వంకదారి రాజా, కమిటీ సభ్యులు గణేష్, రామచంద్రయ్య, సుబ్బరామయ్య, విక్కీ, సముద్రాల సుధాకర్, భూమా సుబ్రహ్మణ్యం, ఎం. నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు. Tadipatri