
TG Bharat | తాడిపత్రి అర్బన్, జూన్ 15 (ప్రభాతవార్త): తాడిపత్రి పర్యటనకు వచ్చిన అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ భరత్‌ను జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తలుపుల సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇటీవల అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తలుపుల సురేంద్రనాథ్ ఈ నెల 25న జరగనున్న తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి టీజీ భరత్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై కూడా చర్చించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించినట్లు సంఘం నాయకులు తెలిపారు. జిల్లా స్థాయిలో ఆర్యవైశ్య సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా మంత్రితో చర్చించినట్లు సమాచారం.
మంత్రి టీజీ భరత్‌ను కలిసిన వారిలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు టంగుటూరి శృతి, ప్రధాన కార్యదర్శి తలుపుల శ్రీదేవి, తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వంకదారి రాజా, కమిటీ సభ్యులు గణేష్, రామచంద్రయ్య, సుబ్బరామయ్య, విక్కీ, సముద్రాల సుధాకర్, భూమా సుబ్రహ్మణ్యం, ఎం. నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాడిపత్రి అర్బన్, జూన్ 15 (ప్రభాతవార్త): తాడిపత్రి పర్యటనకు వచ్చిన అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ భరత్‌ను జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తలుపుల సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
మంత్రి టీజీ భరత్‌ను(TG Bharat) కలిసిన వారిలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు టంగుటూరి శృతి, ప్రధాన కార్యదర్శి తలుపుల శ్రీదేవి, తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వంకదారి రాజా, కమిటీ సభ్యులు గణేష్, రామచంద్రయ్య, సుబ్బరామయ్య, విక్కీ, సముద్రాల సుధాకర్, భూమా సుబ్రహ్మణ్యం, ఎం. నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Politics:జేసీ-కేతిరెడ్డి వివాదంలో మంత్రి టీజీ భరత్ ఎంట్రీ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Two-Year Trust Program:సంక్షేమ పాలనపై లబ్ధిదారుల ప్రశంసల వెల్లువ!
kalyandurg seed distribution:రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం: ఎమ్మెల్యే సురేంద్రబాబు!
EO Srinivasa Rao: శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై ఈవో సమీక్ష!
Prakash Raj: రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు
Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Tadipatri