
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPF Withdrawal New Rules: దేశంలోని వ్యవస్థీకృత ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మెరుగైన డిజిటల్ సేవలను అందించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ తన డేటాబేస్, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా.. జూన్ 26 నుండి జూన్ 30 వరకు 5 రోజుల పాటు కొత్త PF క్లెయిమ్‌లు స్వీకరించదు. ఈ కాలంలో క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేస్తుంది. జూన్ 26కి ముందు సమర్పించిన క్లెయిమ్‌లు రద్దవ్వవు. ఈపీఎఫ్ఓ ప్రకారం.. సిస్టమ్ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత, జూలై 1, 2026 నుండి EPFO సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. EPFO జారీ చేసిన నోటీసు ప్రకారం.. EPFO మెంబర్ పోర్టల్, ఎంప్లాయర్ పోర్టల్, UMANG యాప్‌లోని అనేక సేవలు జూన్ 26, 2026న అర్ధరాత్రి 12 గంటల నుండి జూన్ 30, 2026న రాత్రి 11:59 గంటల వరకు మొత్తం 120 గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతాయి. లక్షలాది మంది ఉద్యోగుల పదవీ విరమణ నిధులను నిర్వహించే ఈ ప్రభుత్వ సంస్థ.. సమయంలో సిస్టమ్ మైగ్రేషన్, డేటాబేస్ అప్‌గ్రేడ్‌లు నిర్వహిస్తుందని.. తద్వారా భవిష్యత్తులో వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందిస్తామని తెలిపింది. సిస్టమ్ అప్‌గ్రేడ్‌ల సమయంలో ఈ సేవలు అందుబాటులో ఉండవు: -కొత్త PF క్లెయిమ్‌ను సమర్పించడం సాధ్యం కాదు. -క్లెయిమ్ ప్రాసెసింగ్ తాత్కాలికంగా నిలిచిపోతుంది. -కొత్త ఉద్యోగులకు UAN లింకింగ్ సాధ్యం కాదు. -ఇ-పాస్‌బుక్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండదు. జూన్ 26వ తేదీకి ముందు సమర్పించిన క్లెయిమ్‌లు రద్దవ్వవు. సేవలు పునరుద్ధించిన తర్వాత వాటి