
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడు బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అతడిని తీసుకెళ్లగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఓ పోలీసు సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ లాక్కొని పారిపోవడానికి యత్నించడమే కాకుండా.. ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడని పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అతడికి బుల్లెట్ గాయాలయ్యాయని వెల్లడించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో అతడు ప్రధాన నిందితుల్లో ఒకడని, బాలిక అదృశ్యమయ్యే ముందు ఆమెతో కలిసి ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు చెప్పారు. హత్యాచార ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన కొద్ది గంటల్లోనే అనుమానంతో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి డీజీపీని ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు


















.webp)





.webp)







