
హైదరాబాద్ పాతబస్తీలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, జూన్ 24: నగరంలోని పాతబస్తీలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్గూడ ప్రాంతంలో గల రాజ్ దర్బార్ హోటల్ సమీపంలో ఉన్న ఒక ఐస్క్రీమ్ షాపులో 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. సదరు బాలిక ఐస్క్రీమ్ కొనుగోలు చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో షాపులో పనిచేస్తున్న ధనుంజయ్ అనే వ్యక్తి బాలికపై కన్నేశాడు. ఆ చిన్నారిని బలవంతంగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఐస్క్రీమ్ షాపుపై దాడి చేశారు. అనంతరం డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే డబీర్పురా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And Telugu News